మా మేడమ్‌ చెప్పిందే వేదం..చేసిందే శాసనం!?

https://epaper.netidhatri.com/view/398/netidhathri-e-paper-6th-october-2024%09

`టెస్కో లో అవినీతిని నాన్చుతారా.!తేల్చుతారా.?

`మా మేడమ్‌ను ప్రశ్నించే లెవలా?

`రేవంత్‌’’ పై కేటిఆర్‌ సవాల్‌ విసిరినా శాఖలో చలనం లేదు

`టెస్కోలో కమిషనర్‌ కు ఎదురు లేదు! మంత్రి తుమ్మల మాటకు విలువ లేదు!?

`కేటీఆర్‌ చేసిన సవాలుకు స్పందన లేదా?

`ప్రజా ప్రభుత్వంలో ఎవరి మాటకు విలువ ఉన్నట్టు

`సీనియర్‌ ఐఏఎస్‌ల మీద టెస్కో ఉద్యోగుల బూతు పురాణం?

`ఐఏఎస్‌ అధికారులను కూడా తిట్టేంత ధైర్యం ఎందుకొచ్చింది?

`మా మేడమ్‌ మళ్ళీ వచ్చినందుకు కొండంత బలం వచ్చిందని ఐఏఎస్‌లను తిడుతున్నదెవరు?

`వాళ్లో అధికారులా? మా మేడమ్‌ ముందు ఎందుకూ పనికిరారు?

`ఐఎఎస్‌లు జయేష్‌ రంజన్‌, అలుగు వర్షిణిల మీద నోరు పారేసుకుంటున్న ఉద్యోగులు?

`రాయకూడని బాషలో తిట్టిపోస్తున్నారు?

`ఎంక్వౌరీ పేరుతో లేనిపోని అపోహలు సృష్టించారు?

`మా మేడమ్‌తో పెట్టుకుంటే ఎక్కడుంటారో ఆ అధికారికి ఇప్పటికే అర్థమైవుంటుంది?

`టెస్కోలో అంతా సవ్యంగానే జరిగింది? అపోహలన్నీ అల్లిన కట్టుకథలే! ఇదీ ఇప్పటి టెస్కో కమీషనర్‌ అనుచర ఉద్యోగుల మాట!

`మరి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికీ చెబుతున్న మాటలు అవాస్తవమా?

`మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినట్లు?

`టెస్కోలో అవినీతి గురించి మంత్రి మాట్లాడిరదెందుకు?

`బాధ్యత కలిగిన మంత్రి తుమ్మల మాటలు అబద్దాలని ఉద్యోగులు తేల్చేస్తున్నారా?

`అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన మాటలకు విలువ లేదా?

`నిండు సభలో టెస్కో అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు నిజం కాదా?

`అవినీతి జరిగిందన్న తర్వాత కూడా లెక్కలు తేలకుండా బకాయిలు ఎలా చెల్లించారు?

`గతంలో సరుకు రవాణా చేసిన ముగ్గురికి మూడు కోట్లు ఎందుకు చెల్లించారు?

`కొత్త వారికి 20 శాతం మాత్రమే చెల్లింపులే చేశారు.

`తప్పులు దొర్లిన ఆరోపణలున్న ట్రాన్స్‌పోర్ట్‌ లకు పూర్తి బిల్లులు ఇచ్చేశారు.

`కళావతికి నాలుగు నెలల జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారు!

`జీతం కోసం నా దగ్గరకు రావొద్దని సాక్షాత్తు కమీషనరే కళావతికి చెబుతున్నారు.

`ఎవడు ట్రాన్స్‌ఫర్‌ చేశాడో వాడినడుక్కో అంటున్నారు?

`నేటిధాత్రి పత్రికపై ఉద్యోగుల చిందులు!

`మా మేడమ్‌ తలుచుకుంటే ఏదైనా చేస్తారు?

`ఇప్పటికైనా రాతలు మానుకుంటే మంచిది! లేకుంటే అంతు చూస్తామని ఉద్యోగుల ముందు పేలుతున్న కమీషనర్‌ అనుచరులు!

`ప్రభుత్వమే మాది…మమ్మల్ని కదిలించేవారు లేరు?

`‘‘సిఎం రేవంత్‌ రెడ్డే’’ సైలెంట్‌గా వున్నారు?

`‘‘నేటిధాత్రి’’ ఒక లెక్కనా? అంటూ హూంకరింపులు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

టెస్కోలో కొన్నేళ్లుగా పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలున్నాయి. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికూడా పలుసార్తు ప్రస్తావించారు. తాము అదికారంలోకి వచ్చిన తర్వాత సంగతి తేల్చుతామన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడపాడదపా ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా నిండు అసెంబ్లీలో టెస్కోలో జరిగినదాన్ని బైటకు తీస్తామన్నారు. కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై దృష్టిసారించారు. మీడియా ముఖంగా అనేక అంశాలు వెల్లడిరచారు. పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న సంగతి కూడా చెప్పారు. టెస్కొలో అనేక బోగస్‌ సహాకార సంఘాలున్నాయన్నారు. దారి మళ్లిన నిదులను గుర్తించామన్నారు. అవినీతి చేసిన వారిని బాధ్యులను చేస్తామన్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుల చేసిన ఆరోపణలపై కేటిఆర్‌ స్పందించి సవాలు విసిరాదు. గతంలో పనిచేసిన కార్యదర్శి ఇప్పుడు కూడా వున్నారని చెప్పుకొచ్చారు. మరి ప్రభుత్వం కదిలింది లేదు. టెస్కోలో అవినీతి చేసిన వారి మీద చర్యలు తీసుకున్నది లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన కమీషనర్‌ ఎందుకు బదిలీ అయినట్లు? మళ్లీ పాత కమీషనరే ఎందుకు వచ్చినట్లు? అంటే చేనేత, జౌళిశాఖకు సంబంధించిన కార్యదర్శి మంత్రి తుమ్మలకన్నా పవర్‌ ఫుల్‌ అన్నది చెప్పడానికేనా? టెస్కొలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని మంత్రి ప్రకటించిన తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దాంతో టెస్కొలో కమీషనర్‌కు ఎదురులేదు. మంత్రి మాటకు విలువ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌ మాటకన్నా, మంత్రి తుమ్మల ఆదేశాలకన్నా కమీషనరే మాటే చెల్లుబాటౌతుందన్న వాదనలకు బలం చేకూరుతున్నాయి. టెస్కొలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న వారి పాలనలోనే పాత అధికారులకే పెత్తనం అప్పగిస్తే ఇక అవినీతి ఎలా తేలుతుంది? ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యల్లో ఇప్పటికీ పాత వాసనలున్న అధికారులున్నారని అన్నారు. వాళ్లే ప్రతిపక్షాలకు సమాచారం చేరవేస్తున్నారని చెప్పారు. ఇక జిల్లా ల్లో గత ప్రభుత్వ నాయకుల కనుసన్నల్లో పనిచేసిన అదికారులను పక్కన పెడుతున్నారు. రాష్ట్ర స్దాయిలో కూడా అదే జరిగింది. తాజాగా పెద్దఎత్తున పోలీసుశాఖలో కూడా సిఐ, ఎస్సైలను దూరం పెట్టింది. అలాంటిది టెస్కొ విషయంలో మాత్రం ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది. అసలు టెస్కొలో అవినీతి జరిగిందా? లేదా? అన్నది ప్రభుత్వం తేల్చాల్సిన అసవరం వుంది. ఇక్కడ చేనేత కార్మికులు కూడా అనేక అంశాలను లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం వున్న కమీషనర్‌ స్ధానంలో మరొకరు వుంటే ప్రభుత్వం ఇలాగే వ్యవహరించేదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ప్రజా ప్రభుత్వంలో ఎవరికి మాటకు విలుందన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అసలు టెస్కొలో అవినీతి అన్నది రాజకీయంగా వాడుకోవడం కోసమేనా? ఇలాగే నాన్చుతారా? లేక తేలుస్తారా అన్న ప్రశ్నలకు ప్రభుత్వమే సమాదానం చెప్పాలి. ఇది లా వుంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన కమీషనర్‌ శైలాజా రామయ్య తిరిగి రావడంతో స్దానం చలనం పొందిన అధికారులంతా వచ్చి చేరారు. కమీషనర్‌ శైలజా రామయ్య ఛార్జ్‌ తీసుకున్న మరసటి రోజే టెస్కొ కేంద్ర కేంద్ర కార్యాలయం నుంచి స్ధాన చలనం పొందిన వాళ్లందా వచ్చి, కమీషనర్‌కు ఎదురులేదు, తిరుగులేదు. అంటూ కొత్త బాష్యాలు చెబుతున్నారు. అంతే కాదు టెస్కొలో మా కమీషనర్‌ చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్లు కొంత మంది ఉద్యోగులు ఏకంగా సీనియర్‌ ఐఏఎస్‌లైన జయేష్‌రంజన్‌, అలుగు వర్షిణిలపై తిట్ల దండకాలు వల్లిస్తున్నట్లు సమాచారం. అసలు వాళ్లు ఎలా ఐఏఎస్‌లు అయ్యారంటూ హేళన చేస్తున్నారని తెలుస్తోంది. మా మేడమ్‌ ముందు ఆ ఐఎఎస్‌లు ఎందుకు పనికి రారంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నట్లు ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. మా మేడంతో పెట్టుకుంటే ఎక్కడ పనిచేస్తున్నవాళ్లు ఎక్కడికి వెళ్లారో చూస్తున్నారుగా…అంటే ఇతర ఉద్యోగుల మందు ఐఎఎస్‌ అలుగు వర్షిణి గురించి మాట్లాడుతున్నారట. ఇక సీనియర్‌ ఐఏఎస్‌ జయేష్‌ రంజన్‌ రాసిన లెటర్లను చిత్తుకాగితాలతో పోల్చుతూ తమ మేడమ్‌ దేవత, ఆమె కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలని అంటున్నారట. అసలు మీడియా రాయలేని బాషలో ఇద్దరు ఐఎఎస్‌లతోపాటు, విజిలెన్స్‌కు సహకరించిన ఇతర ఉద్యోగులను తిట్టిపోస్తున్నారు. వారిని వేధిస్తున్నారని సమాచారం. గతంలో విజిలెన్స్‌కు సహకరించి కళావతి అనే ఉద్యోగికి నాలుగు నెలలుగా జీతాలు ఆపారు. గత కమీషనర్‌ ఆదేశాలకన్నా, ఒత్తిడి మేరకే రిపోర్టు ఇవ్వడం జరిగిందన్న మాటను రాసిస్తూ లెటర్‌ ఇవ్వాలని హెచ్చిరిస్తున్నారు. పైగా కళావతి తన జీతం కోసం కమీషనర్‌ను ఎన్ని సార్లు కలిసినా తనను కలవొద్దని చెప్పాను కదా? అంటే ముఖం మీదే చెప్పేసి వెళ్లిపోతున్నారట. అంతే కాకుండా కళావతిని బదిలీ చేసిన వారి దగ్గర నుంచే జీతం తీసుకొమ్మంటూ టిస్కొలోని ఓ ఉద్యోగి కళావతికి తేల్చి చెబుతున్నారట. అసలు టెస్కొలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు? అదంతా అపోహలు. అల్లినకట్టుకథలు అంటూ టెస్కొలో ఉద్యోగ సంఘ నాయకుడు అంటూ, ప్రభుత్వమే మా చేతుల్లో వుంది. మా మేడం తల్చుకుంటే ఏదైనా చేస్తారంటూ విజిలెన్స్‌కు సహకరించిన ఉద్యోగుల మీద కారాలు మిరియాలు నూరుతున్నారట. టెస్కొలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది లక్ష డాటర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఓ వైపు టెస్కొలో గత కొన్నేళ్లుగా జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ ఎంక్వౌరీ ఇంకా పూర్తి కానేలేదు. కాని కమీషనర్‌ శైలజా రామయ్య, గతంలో సరుకు రవాణా చేసిన ట్రాన్స్‌పోర్టులకు సుమారు మూడు కంపనీలకు మూడు కోట్ల రూపాయలు చెల్లించారు. తర్వాత టెండర్ల ద్వారా వచ్చిన కొత్త ట్రాన్స్‌పోర్టు కంపనీలకు బిల్లులు మాత్రం 20 శాతమే విడుదల చేశారు. అంటే గతంలో కమీషనర్‌కు అనుకూలంగా పనిచేసిన ట్రాన్స్‌పోర్టులకు బిల్లులు ఆపాలన్నది విజిలెన్స్‌ ఎంక్వౌరీ ఆదేశాలు. కాని ఆ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వారికి బిల్లులు చెల్లించారు. ఇదెలా సాధ్యమనేది ప్రభుత్వమే చెప్పాలి. అసలు టెస్కొలో అవినీతే జరగలేదన్నప్పుడు ఆ విజిలెన్స్‌ ఎంక్వౌరీని రద్దు చేయండి? అక్కడ అవినీతే జరగలేదని తేల్చేసేయ్యండి? మంత్రి తుమ్మలకు సమాచారం లోపం వల్ల అవినీతి జరిగిందని చెప్పాల్సివచ్చిందని చెప్పగలరా? సుమారు 40 సంవత్సరాల సుథీర్ఘ అనుభవంతోపాటు, మంత్రిగా ముప్పై ఏళ్లపాటు పరిపాలన మీద అనుభవం వున్న మంత్రి తుమ్ముల మాటలను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి ఏమైనా పనిచేస్తుందా? తెలియాల్సివుంది. బాధ్యత కలిగిన సీనియర్‌ మంత్రి మాటలు తప్పని ఉద్యోగులు చెప్పదల్చుకున్నారా? మా ముందు ప్రభుత్వమే దిగదుడుపు అని హేళన చేస్తున్నారా? అసలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుంటే, ఎలా? తన మాటే జీవో అని గతంలో చెన్నారెడ్డి తర్వాత చెప్పిన రేవంత్‌ రెడ్డి మాటలకు విలువ లేదా? ఆయన మాటలు జీవో లు కాదని అంటున్నారా? టెస్కొలో అవినీతి ఆరోపణలున్నా బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో మంత్రికి సమాచారం వుందా? లేదా? ఇదిలా వుంటే టెస్కొ మీద వరుస కథనాలు రాస్తున్న నేటి ధాత్రి మీద కొందరు ఉద్యోగులు చిందులు తొక్కుతున్నారట. మా మేడం తల్చుకుంటే ఏదైనా చేస్తారని బెదిరిస్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా నేటి దాత్రి రాతలు మానుకోకపోతే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయంటున్నారట. టెస్కొలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం ప్రకటిస్తే నేటిదాత్రి ఎందుకు రాస్తుంది? సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నాయకులే ఈ విషయాలను పదే పదే గుర్తుచేస్తుంటే నేటిధాత్రి రాయకుండా ఎందుకు వుంటుంది? ఇక్కడ ఉద్యోగులే సుప్రిం అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. ప్రభుత్వమే మాది. మమ్మల్ని కదిలించేవారు లేరు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే సైలెంటుగా వున్నారు. నేటిధాత్రికి ఏమౌసరం అంటూ హూంకరిస్తున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మేలుకొంటుందా? నిద్ర నటిస్తుందా? అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందా? వార్తలు రాయడమే తప్పని చెబుతుందో చూడాలి.

అక్రమార్కుల బేధిరింపులకు నేటిధాత్రి భయపడదు..
ఇదిగో ఆధారాలు…ఇంకా ఎన్ని
ఆధారాలు కావాలో చెప్పండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *