*పత్రిక ప్రకటన*
నిజాంపేట మండలం
23/1/2026 నర్లాపూర్
* నార్లపూర్ గ్రామంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలు
* యువత నేతాజీని ఆదర్శంగా తీసుకుని రక్షక భటులు గా నిలవాలి
యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్
నిజాంపేట, నేటి ధాత్రి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజంలో రక్షక భటులు గా నిలవాలనీ జగన్ అన్నారు
ఈ సందర్భంగా నార్లపూర్ గ్రామంలో సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలో గ్రామ సర్పంచ్ స్వప్న పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ యువత నేతాజీ ఆశయాల కోసం పని చేయాలని అన్నారు గ్రామంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సేవా భావం కలిగి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ స్రవంతి ఉప సర్పంచ్ రామచంద్రం, వార్డు సభ్యులు మధు ,సంజీవులు, పురుషోత్తం, గ్రామ ప్రజలు ,విద్యార్ధులు పాల్గోన్నారు
