మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

బంగారం ప్రియులకు మరోసారి షాకింగ్ వార్త వచ్చింది. ఇప్పటికే లక్ష రూపాయలు దాటిన పసిడి ధరలు మరింత పుంజుకున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే లక్షకుపైగా చేరుకున్న ధరలు ఇంకాస్తా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, జులై 22, 2025న ఉదయం 6:20 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.1,00,160కి చేరుకుంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,810కి చేరింది. ఈ ధరల (Gold Rates Today on july 22nd 2025) పెరుగుదలకు కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటి పలు అంశాలు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
  • హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,810.
  • విజయవాడ: హైదరాబాద్‌తో సమానంగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.
  • ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,310, 22 క్యారెట్ల బంగారం రూ.91,960.
  • ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.
  • చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.
  • కోల్‌కతా: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,510, 22 క్యారెట్ల బంగారం రూ.91,230.
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.
  • కేరళ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.
  • పూణే: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.
  • అహ్మదాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,210, 22 క్యారెట్ల బంగారం రూ.91,860.
  • ఈ ధరలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, దిగుమతి సుంకాలు వంటి అంశాల వల్ల నగరాలను బట్టి మారుతాయి.

వెండి ధరలు మాత్రం..

వెండి ధరలు నిన్నటి ధరలతో పోల్చితే మారకుండా ఉన్నాయి. ఈ క్రమంలో ముంబైలో కిలో వెండి ధర రూ.1,15,900గా ఉండగా, ఇతర నగరాల్లో ధరలు కింది విధంగా ఉన్నాయి.

  • హైదరాబాద్: కిలో వెండి ధర రూ.1,25,900.
  • విజయవాడ: కిలో వెండి ధర రూ.1,25,900.
  • ఢిల్లీ: కిలో వెండి ధర రూ.1,15,900.
  • చెన్నై: కిలో వెండి ధర రూ.1,25,900.
  • కోల్‌కతా: కిలో వెండి ధర రూ.1,15,900.
  • బెంగళూరు: కిలో వెండి ధర రూ.1,15,900.
  • కేరళ: కిలో వెండి ధర రూ.1,25,900.
  • పూణే: కిలో వెండి ధర రూ.1,15,900.
  • అహ్మదాబాద్: కిలో వెండి ధర రూ.1,15,900.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మళ్లీ వీటి ధరల గురించి తెలుసుకుని నిర్ణయించుకోవడం మంచిది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version