అతి చిన్న వయసులో సర్పంచ్ అయిన నాజియా అంజుమ్ షేక్ సోహెబ్…

 

అతి చిన్న వయసులో సర్పంచ్ అయిన నాజియా అంజుమ్ షేక్ సోహెబ్…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సాధారణంగా 22 ఏళ్ల వయసులో యువతీ యవకులు ఏం చేస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయరో..లేదో ఫైనల్ ఇయరో చదువుతుంటారు. మరికొందరు ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. కానీ ఓ యువతీ మాత్రం.. ఊరికి సర్పంచ్ అయిపోయింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.తెలంగాణలో ఓ యువతీ.. ఊరికి సర్పంచ్గా ఎన్నిక అయింది. దేశంలోనే అతి చిన్న వయసు గల సర్పంచ్గా రికార్డు సృష్టించింది.తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ అనే యువతి సర్పంచ్గా ఎన్నికయింది. తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడిన అతను..92 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిపై గెలిచి..దేశంలోనే అతిపిన్న వయసు గల సర్పంచ్గా రికార్డు సృష్టించాడు. నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ వయసు 22ఏళ్ల మాత్రమే.
నాజియా అంజుమ్ షేక్ సోహెబ్…కరోనా సమయంలో ఊరికి వచ్చినప్పుడు..గ్రామంలో ప్రజలు, స్నేహితులు ఇబ్బందులు పడటం చూసి చలించిపోయాడు. విలేజ్లో సరైన సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడటం గమనించాడు. ఆ సమయంలో తన వల్ల అయిన సాయం చేశాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి… ఇదే సమయంలో గ్రామంలో పంచాయితీ ఎన్నికలు రావడంతో..గ్రామస్తులు నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ నే సర్పంచ్ గా నిలబెట్టారు. అయితే బి ఆర్ ఎస్ నేత, ఎమ్మెల్యే మాణిక్ రావు మండల అధ్యక్షులు వెంకటేశం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ గ్రామస్తులు నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ నే సర్పంచ్ను ఎన్నకున్నారు.
సర్పంచ్ గా గెలిచిన తర్వాత జిల్లా పాలనాధికారితో పాటు తనకు సహకరించిన అందరికీ నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని నాజియా అంజుమ్ షేక్ సోహెబ్ అన్నారు. గ్రామాన్ని ఆదర్శగ్రామంగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version