రామకృష్ణాపూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ, సీయోను, పెంతేకొస్తు చర్చిలలో గురువారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి .పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకున్నారు.
ఏసుక్రీస్తు జన్మదినన్ని పురస్కరించుకొని చర్చి పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ వేడుకలకు తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్టమస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. క్రైస్తవ సోదరులందరూ కలిసిమెలిసి సోదర భావంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.
క్రైస్తవులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, కమ్యూనిటీకి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా సరే ప్రభుత్వం తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మాజీ చైర్ పర్సన్ జంగం కళ,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, శ్యామ్ గౌడ్,గండి కుమార్ గౌడ్,సంఘ రవి, పుల్లూరి కల్యాణ్, చర్చి పాస్టర్లు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
