నయనతారకు రూ. 10 కోట్లా?
గోపీచంద్ మలినేని మార్కు మాస్ ఎలిమెంట్స్, బాలయ్య ఊరమాస్ మేనరిజమ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. ‘వీర సింహారెడ్డి’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో సింహ గర్జన చేయడానికి సిద్ధమవుతోంది.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది.
బాలకృష్ణ- నయనతార.. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్. కలిసి పని చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. పైగా నయన మంచి ఫామ్ లో ఉంది. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న సినిమాలో మొదట నయనతార నే ఎంపిక చేసుకొన్నారు. కానీ.. ఇప్పుడు ఆ స్థానంలో కాజల్ వచ్చి చేరింది. బాలయ్య – నయనతార కాంబోకి ఉన్న క్రేజ్.. బాలయ్య – కాజల్ కి లేదన్నది వాస్తవం. కాకపోతే.. నయనకు పక్కన పెట్టడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం నయనతార దాదాపుగా రూ.10 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. పైగా కాల్షీట్ల సర్దుబాటు విషయంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. నయనతారని ప్రమోషన్లకు తీసుకురావడం దాదాపు అసంభవం. కాజలక అయితే.. చాలా తక్కువ పారితోషికంలో అందుబాటులో ఉంటుంది. కావాల్సినన్ని కాల్షీట్లు ఇస్తోంది. ప్రచారానికీ వస్తుంది. అందుకే… నయనని పక్కన పెట్టి, కాజల్ తో సర్దుకుపోతోంది టీమ్. ఈ సినిమాలో మరో కథానాయికకూ అవకాశం ఉంది. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. మరోవైపు టైటిల్ కోసం అన్వేషణ జరుగుతోంది. ‘వీర సింహారెడ్డి’లానే ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం జల్లెడ పడుతోంది చిత్రబృందం.
