దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె

దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె కేంద్రంలో విజయవంతం

మహాదేవపూర్ నేటి దాత్రి :

ఈరోజు మహదేవపూర్ మండలకేంద్రము లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
సీఐటీయూ మండల కమిటీ
మహదేవపూర్… కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు మహాదేవపూర్ మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మె జయప్రదం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాల స్వతంత్ర ఫెడరేషన్లు ప్రజాసంఘాల పిలుపుమేరకు ఈరోజు మహదేవపూర్ మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరిగింది ఈ సందర్భంగా మహదేవపూర్ మండల్ ప్రజాసంఘాల నాయకులు పోలం రాజేందర్ కుమ్మరి రాజు మాట్లాడుతూ

 

 

దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతును ప్రకటించిందని వారు అన్నారు సమ్మె రోజున గ్రామీణ బందుకు పిలుపునిచ్చిందన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరిగిందని వారు తెలియజేశారు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తుందన్నారు కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను ముందుకు తెచ్చింది అన్నారు వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్ లను అమలు 5 సంవత్సరాలు ఆలస్యమైన ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మికుల హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుందన్నారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను నేడు ఈ చట్టాల ద్వారా ముప్పు వాటిల్లుతున్న అన్నారు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడులను అమలులోకి తెస్తుందన్నారు దీనికి సంబంధించి 12 గంటల పనినీ చట్టబద్ధం చేస్తున్నారని సామాజిక భద్రత పథకాలకు నిధులు తగ్గిస్తున్నారు కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు కూడా అన్నారు ఉమ్మడి వీర సారాల హక్కులను తొలగించి వాటిని బిఎన్ఎస్ చట్టం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా మార్చడం పని స్థలాల వద్ద గేటు మీటింగ్లు కరపత్రాలు పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటిని తుంగలోకి తొక్కుతుందన్నారు చట్టాలను అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం కార్మిక శాఖలు పూర్తిగా ఫెసిలిటీస్ విభాగంగా మార్చడం స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించకుండా వెట్టిచాకిరి చేసే విధంగా లేబర్ కోడులను రూపొందించింది అన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల సమ్మె హక్కు నిర్వీర్యం చేస్తూ సమ్మె చేయలేని కార్మికులకు తిరిగి బానిసత్వంలోకి నెట్ ఎందుకు ప్రయత్నిస్తుందన్నారు దుకే నాలుగు రెబల్ కోడ్ లను తిప్పి కొట్టి కార్మిక చట్టాలను కాపాడుకోవడం కార్మిక వర్గానికి చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు మధ్యాహ్నం భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version