జాతీయ జర్నలిస్టుల సమావేశం విజయవంతం

జాతీయ జర్నలిస్టుల సమావేశం విజయవంతం

ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన కార్యక్రమం.

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నిర్వహించిన నేషనల్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ జర్నలిస్టుల సమావేశాలు విజయవంతమయ్యాయని టీఎస్ జేయూ రాష్ట్ర ఆర్హనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడుక సుధాకర్,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ తెలిపారు. ఈ సమావేశాలకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి జర్నలిస్టు ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో టిఎస్జేయూ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు,సంక్షేమం,భద్రత,హక్కుల సాధన వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో పలువురు రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించగా,జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక సూచనలు వచ్చినట్లు చెప్పారు.జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీలు,హెల్త్ కార్డులు,గృహ పథకాలు,బీమా,పెన్షన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు వివరించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జర్నలిస్టు నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమావేశాలు జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని, టీఎస్జేయూ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్ నేతృత్వంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version