విఘ్నేశ్వరుని పూజలో ముస్లిం యువకుడు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామ్ సేనా గణేష్ వద్ద ఏజాజ్ పటేల్ అనే ముస్లిం యువకుడు వినాయకుని పూజల్లో పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించామని ఏజాజ్ పటేల్ అన్నారు. పూజ అనంతరం శ్రీ రామ్ సేన గణేష్ కమిటీ సభ్యులు ఏజాజ్ పటేల్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, డిప్యూటీ సర్పంచ్, శ్రీరామ్ సేన గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.