మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన ఎంపీపీ

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను బుధవారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పున్నం బుచ్చి రాజిరెడ్డి, ఎక్కటీ మధుసూధన్ రెడ్డి, పున్నం వెంకటేశ్వర్ రెడ్డి, తేడ్ల బాబు, సరిగొమ్ముల స్వామి, బుషావెని మల్లయ్య, ఐరెడ్డి రాజు, బూర్గుల ఐలు, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!