ఈటలను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరు కృషి చేయాలి: వికే మహేష్….
మల్కాజిగిరి, నేటిధాత్రి:
మాజీ మంత్రి, బిజెపి పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గం నుండి బిజెపి నాయకులు భారీగా తరలి వెళ్లి ఈటలకు పూలదండ, శాలువతో, సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు వికే మహేష్ ,జిన్నా గణేష్ ముదిరాజ్ లు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ను మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ కంకణ బదులై ఈటల గెలుపుకు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో బిజెపి నాయకులు మోహన్ యాదవ్, జగదీష్ ముదిరాజ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.