వరకు మోస్తరు వర్షాలు..
రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
చెన్నై: రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై(Chennai) వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో… మధ్య తూర్పు బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతం మియన్మార్ వద్ద సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి మియన్మార్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందన్నారు. అదే సమయంలో తూర్పు దిశ గాలుల వేగంలో మార్పు చోటుచేసుకుంది.
