ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు!?

`స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే ఏ నిర్ణయమైనా వుండొచ్చు?

`పిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ ఆచి తూచి అడుగులు.

`న్యాయ నిపుణులతో విసృతమైన సంప్రదింపులు.

`ముందు స్థానిక సంస్థల ఎన్నికలు!

`ఫలితాలను బట్టి నిర్ణయాలు!

`కాంగ్రెస్‌ పెద్దల ఆలోచనలు.

`ఎన్నికల ముందు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు.

`కాంగ్రెస్‌ తప్పు చేసిందనే భావన ప్రజల్లో రావొచ్చు.

`బీఆర్‌ఎస్‌ ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు.

`స్థానిక సంస్థలలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధిస్తే ఒక రకమైన నిర్ణయం.

`లేకుంటే ప్రత్యామ్నాయంగా మరో మార్గం.

`మూడు నెలల గడువుపై ఎవరి వాదనలు వాళ్లవి.

`పిరాయింపు ఎమ్మెల్యేల తీర్పు బీఆర్‌ఎస్‌ కు గుణపాఠమని కాంగ్రెస్‌ అంటోంది.

`కాంగ్రెస్‌ కు సుప్రీం తీర్పు చెంప పెట్టు అని బీఆర్‌ఎస్‌ చెబుతోంది.

`బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు జారుకుంటున్నారు.

`బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై చర్చ మరో సారి ఊపందుకున్నది.

`ఈ సమయంలో ఎమ్మెల్యేలపై వేటు అంశం పక్కకు పోయింది.

`మూడు నెలలలో ఏదైనా జరగొచ్చు.

`అప్పటి దాకా ఆగి పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకోవచ్చు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  తెలంగాణలో పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై వేడు పడుతుందా? లేక ఇంకా వేచి చూసే ధోరణి కనిపిస్తుందా? స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగేదాకా? ఆగుతారా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీ స్పీకర్‌ను కలిసి పిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరడం జరిగింది. అయినా స్పీకర్‌ సరైనసమయంలో సరైననిర్ణయం అనే పదం ఉపయోగించడం చాలా సార్లు విన్నాం. ఇప్పుడు కూడా అదే వింటున్నాం. అయితే పిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటికప్పుడు వేటు అనే ప్రశ్నే ఉత్పన్నమౌతుందనే వాతావరణం కనిపించడం లేదు. ఓ వైపు స్దానికసంస్ధల ఎన్నికల గడువు తరుముకొస్తోంది. హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మూడునెలల గడువు విధించింది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించపోతే స్వయంగా కోర్టు ఎన్నికల కమీషన్‌కు ఆదేశాలిచ్చే పరిస్దితి రావొచ్చు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్ధితి ఎదురయ్యే ప్రమాదం వుంది. ఓ వైపు పిరాయింపు ఎమ్మెల్యేల అంశం. మరో వైపు 42శాతం బిసిల రిజర్వేషన్ల అంశం. రెండూ తెరమీద వున్నాయి. వాటిలో ఏ ఒక్కటి ముట్టుకునే పరిస్దితి కనిపిండచం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా స్దానిక సంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో వుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో వున్నట్లే లెక్క. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే తప్ప గవర్నర్‌ నిర్ణయం తీసుకోలేరు. అందుకు సమయం కూడా మూడు నెలల గడువు వుంటుంది. ఇటీవలే సుప్రింకోర్టు కూడా గవర్నర్‌ వద్దకు వచ్చిన అంశాలపై గరిష్టంగా మూడు నెలల పాటు ఫైల్‌ పెండిరగ్‌లో పెట్టుకోవచ్చు. ఆ లోగా ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించాలి. ఆలోపు ఏలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం వుంది. ఇక్కడ గవర్నర్‌ ఆ 42శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను మూడు నెలలు దగ్గరపడే సమయంలో తిరస్కరిస్తే మొదటికే మోసం వసుంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ బిసి రిజర్వేషన్ల అంశాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చూస్తోంది.. కేంద్రాన్ని దోషిని చేస్తే రిజర్వేషన్లు అమలు జరగడం సాద్యం కాదు. కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. అయినా స్పందన లేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ డిల్లీలో ధర్నా నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున ప్రత్యేక రైళ్లలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు, ముఖ్యులు, ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపడుతున్నారు. అప్పుడైనా కేంద్రం దిగి వస్తుందా? లేదా? అన్నది చూడాలి. కేంద్రం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం చేపట్టిన నిరసనను లైట్‌ తీసుకుంటుందా? లేక సాద్యం కాదని తేల్చిచెబుతుందా? అన్నది కూడా తేలాల్సి వుంది. గత ఎన్నికల సమయంలో బిసి రిజర్వేషన్ల అంశమే ప్రదానంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసుకున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకటించింది. ఆరు గ్యారెంటీల అమలలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటుకావాలి. అందుకు నిధులు కొరత వుంది. ఆరుగ్యారెంటీలు అమలు చేయాలన్న సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి వుంది. కాని సరిపడ నిధులులేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కనీసం బిసి రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం పొందినా కాంగ్రెస్‌పార్టీ ఊపిరి తీసుకునే అవకాశం ఏర్పడుంది. బిఆర్‌ఎస్‌, బిజేపిలను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు దోహదపడుతుంది. ఎవరూ సాదించలేనిది కాంగ్రెస్‌ సాదించిందనే పేరు మిగులుతుంది. సంక్షేమం ఏదైనా సరే కాంగ్రెస్‌తోనే సాద్యమని తెల్చిచెప్పినట్లౌవుంది. పైగా స్దానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సాధించేందుకు వీలుపడుతుంది. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడమా? లేక ఇంకా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడమా? అనే ఆలోచన కూడా తెరమీదకు వస్తుంది. బిసి రిజర్వేషన్లు సాధిస్తే, ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యమైన రెండు విజయాలు దక్కుతాయి. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ గెలిస్తే, బిఆర్‌ఎస్‌ ఉనికి, మనుగడ ప్రశ్నార్ధకమౌతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జిరిగితే మేమే గెలుస్తామని పదే పదే సవాలు చేస్తున్న బిఆర్‌ఎస్‌కు కోలుకోని దెబ్బ పడుతుంది. స్దానిక సంస్ధల ఎన్నికలన్నీ కాంగ్రెస్‌ వశమైతే, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌కు క్యూ కట్టడం మొదలౌతుంది. సీనియర్‌ నాయకులు సైతం బిఆర్‌ఎస్‌ను వదిలిపెట్టడమే తరువాయిగా మారుతుంది. అప్పుడు బిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో మెర్చు చేసుకుంటే పిరాయింపుల అంశమే తెరమీదకు రాదు. అప్పుడు సుప్రింకోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశముండదు. దేశ వ్యాప్త సంచలనం జరుగుతుంది. బిఆర్‌ఎస్‌ తెలంగాణలో మాయమౌతుంది. బిఆర్‌ఎస్‌పార్టీ త్వరలో బిజేపిలో విలీనమౌతుందన్న వార్తకూడా లేకుండాపోతుంది. నిజం చెప్పాలంటే ఇది కాంగ్రెస్‌ కన్నా, బిఆర్‌ఎస్‌కే జీవన్మరణ సమస్యగా మారిపోతుంది. కాని ఫలితాలు అనేవి ఎలా వుంటాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఈ దీక్ష, నిరసనలు కేంద్రం పట్టించుకోకపోతే కాంగ్రెస్‌కు తీరని నష్టం మొదలైనట్టే లెక్క. ఎందుకంటే ఎన్నికల ముందు కేంద్రం అంగీకరిస్తేనే 42శాతం అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పలేదు. కనీసం కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా చెప్పలేదు. ఎట్టిపరిస్దితుల్లోనైనా సరే, ఎలాంటి పరిస్ధితులను ఎదుర్కొనైనా సరే 42శాతం బిసిల రిజర్వేషన్‌ అమలు చేస్తామని చెప్పారు. ఈ విషయంలో మాట తప్పే పరిస్దితి వుండదన్నారు. ఇప్పుడు నెపం కేంద్రం మీద నెట్టేస్తామంటే ప్రజలు నమ్మరు. ప్రతి పక్షాలు ఊరుకోవు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాదిస్తే మాత్రం పిరాయింపు ఎమ్మెల్యేల మీద వేటు వేయకతప్పదు. ఒక వేళ స్దానిక సంస్ధల ఎన్నికల ముందే వేటు వేసినా, రాజీనామాలు చేయించినా మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా వున్నాయి. ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొని తప్పు చేశామని కాంగ్రెస్‌ ఒప్పుకున్నట్లౌవుంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ముందే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అది ఖచ్చితంగా బిఆర్‌ఎస్‌కు అనుకూలమైన అంశమౌతుంది. కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పుకోలేని పరిసి ్దతిని తాను సృష్టించుకున్నట్లౌవుతుంది. ఇక్కడ కూడా ఏరకంగా చూసినా కాంగ్రెస్‌కు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారుతుంది. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న డిమాండ్‌కు బిజేపి తలొగ్గి, స్పందించి పార్లమెంటులో బిల్లు పెడతామని మాట ఇచ్చినా సరే కాంగ్రెస్‌కు ఎంతో ఊరట కల్గుతుంది. బిఆర్‌ఎస్‌కు ఆశలు చల్లారిపోతాయి. అప్పుడు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన పరిస్దితి వస్తుంది. ఏ ఎమ్మెల్యే గోడ దుంకుతాడో అని కాచుకుకూర్చోవాల్సి వస్తుంది. స్దానికసంస్ధల ఎన్నికల్లో చేతులెత్తేయాల్సి వస్తుంది. ఎందుకంటే బిసిల రిజర్వేషన్‌ అమలు అనేది కాంగ్రెస్‌కు తిరుగులేని శక్తిని ఇస్తుంది. మరో పదేళ్లపాటు అధికారం సుస్తిరం చేసుకున్నట్లౌవుంది. మరో పదేళ్లపాటు ప్రచారం చేసుకోవడానికి, చెప్పుకోవడానికి వీలుకల్గుతుంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిన 42శాతం సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్‌ మీదే వుంది. ప్రతిపక్షాలను కలిసి రమ్మనే అవకాశం కూడా లేకపోయింది. ఈ విషయంలో ప్రతిపక్షాలను కాంగ్రెస్‌ కలుపుకుపోయినా బాగుండేది. కాని కాంగ్రెస్‌ ఆ పని చేయలేదు. డిల్లీలో ధర్నా ద్వారా కేంద్రంలో కనీసం కదిలిక వచ్చేలా చేసినా కాంగ్రెస్‌కు ఎంతో ప్లస్‌ అవుతుంది. చూద్దాం..ఏం జరుగుతుందో?

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version