మహారాణి బతుకమ్మ పాట సిడి ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన మహారాణి బతుకమ్మ పాటను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిడి ఆవిష్కరణ చేశారు
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేష్ ఎన్నో సామాజిక ఉద్యమ గీతాలు రాస్తూ ప్రజల మన్నలను పొందుతున్నాడని,
తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా విశిష్టమైనదని పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదని ప్రపంచంలో ఎక్కడ లేదని తెలంగాణలో పండుగ వస్తే ఆనందంతో ఆడబిడ్డలు మెరిసిపోయే అంబరాన్ని తాకే సంబరాలు జరుపుకుంటారని పేర్కొన్నారు బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాల గురించి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామానికి చెందిన గాయకులు మిద్దెపాక మధుకర్, అంబాల గ్రామానికి చెందిన గాయని
జేరిపోతుల సంధ్య, చాలా చక్కగా పాడారని అభినందించారు, ఈ పాట ఎమ్ ఎస్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చని చెప్పారు
ఈ కార్యక్రమంలో నటులు జన్నె యుగేందర్,గాయకులు పుల్ల ప్రతాప్, మిట్టపల్లి బాలు,దొగ్గేల దేవేందర్,గేయరచయిత బానోతు రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు
