కెసిఆర్ నాయకత్వంలో పల్లెల రూపురేఖలు మారాయి.
రమణా రెడ్డి గెలుపు పేద ప్రజల అభివృద్ధికి మలుపు..
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు ఒకవైపు కల్లబొల్లి మాటలు చెప్తూ గెలవాలి అని చూసే తరణం ఒకవైపు అని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి పంగిడిపల్లి,పెద్దంపల్లి వెలిశాల గ్రామాలలో ఎన్నికల ప్రచార సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గండ్ర జ్యోతి రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం కార్యకర్తలందరూ కంకణబద్ధులై పని చేయాలని,కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
2018 ఎన్నికలలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టో లో చెప్పని పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని, ఇప్పుడున్న మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నూటికి నూరు శాతం అమలు చేసే ఏకైక ప్రభుత్వం మనదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యమంత్రి ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉందని కార్యకర్తలందరూ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలియజేశారు.
కార్యకర్తలందరూ సమన్వయంతో గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి మన మేనిఫెస్టో వివరించాలని తెలిపారు.
గ్యారెంటీ ల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీల హామీలను వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ మేరకు అమలు చేశారు ప్రశ్నించాలి.
ఎన్నికల కమిషన్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు ఆపాలని కుట్రపూరిత చర్యలు చేపడుతున్న క్రమంలో కార్యకర్తలే కార్యముకులై ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తిరుపతిరెడ్డి ఎంపీపీ మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చెట్ల రవి ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు