కారు జోరు….ఎన్నికల ప్రచారం
అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు
శాయంపేట నేటి ధాత్రి :
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గల
పలు గ్రామాల్లో ప్రచారంలో భాగంగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరాపెన్షన్లు ,ఉచితంగా మంచినీరు అందరికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.బిఆర్ఎస్ పార్టీనీ అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు
అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల తమ కుటుంబాలకి రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్దులకి అసరా పెన్షన్ లువస్తున్నాయన్నారు.
బిఆర్ఎస్, ప్రభుత్వం వచ్చాక తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కెసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానికి మా గ్రామ ప్రజలందరూ పూర్తి మద్దతు గా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కారు గుర్తుకు ఓటేద్దాం.మన తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం.
ప్రజలకు ఇంటింటికి తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో లోని పథకాలను వివరించి ప్రభుత్వం చేసినటువంటి పనులను వివరిస్తూ మరల మన ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలు వివరిస్తూ బిఆర్ఎస్ మేనిపెస్టోను ప్రజలకు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మోసపురిత హామీలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు అని అన్నారు.గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ సిఎంగా,మరోసారి మన భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిప్రదాత,జనహృదయనేత గండ్ర వెంకటరమణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.