అమ్మ గార్డెన్ ఏరియాలో మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు…
రక్తదానం ప్రాణదానంతో సమానం…
డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు గోపతి భానేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రక్తదానం ప్రాణదానంతో సమానమని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాధ రెడ్డి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 9వ వార్డ్ నాయకులు గోపతి భానేష్ లు అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డ్ అమ్మ గార్డెన్ ఏరియాలో మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక నాయకులు గోపతి భానేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ లు హాజరయ్యారు.రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా రహీం బ్లడ్ ఆర్గనైజేషన్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 100 యూనిట్ల రక్తాన్ని స్వచ్ఛందంగా సేకరించామని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, సేకరించిన రక్తంతో ఎందరో పేద, నిస్సహాయ చిన్నారుల జీవితాలకు భరోసా లభించనుందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న తొమ్మిదవ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మేకల శ్రీనివాస్, భీమ మల్లేష్, గోలి శ్రీనివాస్, నాగరాజు, గడిగొప్పుల తిరుపతి, శివ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
