గుడిలో భారీ చోరీ.. ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
సర్దార్ పటేల్ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. దుండగులు అర్ధరాత్రి గర్భగుడి తాళాలు పగులగొట్టి, విగ్రహంపై ఉన్న రూ.50లక్షల విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు..
హైదరాబాద్ నగరంలోని ఆలయంలో భారీ చోరీ జరిగింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయంలో దొంగలు స్వామి వారి నగలను చోరీ చేశారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. దుండగులు అర్ధరాత్రి సర్దార్ పటేల్ నగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహంపై ఉన్న రూ.50 లక్షల విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుడి దగ్గరకు చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
