`పానీ పూరి నుంచి యూనివర్సిటీ దాకా చేరింది
`తొలుత చిన్న చిన్న టీ షాపులు
`తర్వాత జిలేజీ బండ్లు
`టిఫిన్ సెంట్లర్లు..ఆ పక్కనే స్వీట్లు
`పెద్ద ఎత్తున స్వీట్ అండ్ బేకరీలు
`అప్పుడు మొదలైంది అసలుదందా!
`చిన్న చిన్న కిరాణషాపులు,
`మొబైల్ షాపులు..వాటి ఉపకరణాలు
`ఎలక్ట్రిక్ షాపులు…వుడ్ వర్క్స్
`అద్దాలు, ఫ్లైవుడ్, పెయింట్ షాపులు
`పెద్ద ఎత్తున మార్బుల్, టైల్స్ అమ్మకాలు,
`మొదటి నుంచి బంగారం తాకట్టు వ్యాపారం
`పెద్ద ఎత్తున బట్టల వ్యాపారం
`ఆపై బంగారు దుఖానాలు
`పెద్ద సంఖ్యలో వజ్రాల వ్యాపారాలు
`గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ పధకాలలో కూడా మార్వాడీలు జొరబాటు
`ప్రభుత్వ విద్యా సంస్థలలో అవసరమైన సౌకర్యాల కల్పన సామాగ్రి
`సివిల్ సప్లయ్ శాఖ లో దూరి గన్నీ బ్యాగుల కుంభకోణానికి తెరతీసిన వారిలో మార్వాడీలే వున్నారు
`ఇప్పుడు తెలంగాణలో ప్యాడీ టెండర్ లో దూరి మిల్లర్లను వేధిస్తున్న వారిలో మార్వాడీలున్నారు
`తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు అవసరమైన అన్ని రకాల వస్తువుల సరఫరా చేస్తున్నారు
`అధికారులను మేనేజ్ చేసుకొని టెండర్లు దక్కించుకున్నారు
`నాసిరకం వస్తువుల సరఫరా చేసి, చేతులు దులుపుకున్నారు
`వైద్య విధానంలో కూడా వేలు పెట్టేశారు
`ఆఖరుకు కేసిఆర్ కిట్‌కు చెందిన వస్తువుల సరఫరా కూడా మార్వాడీలదే!
`ఇప్పుడు మార్వాడీ యూనివర్సిటీ..
`రాజాసింగ్ దారిలో రాజకీయాలలోకి జొరబడే ప్రయత్నం
`ఇలా తెలంగాణను మొత్తం ముంచేస్తున్నారు
`తెలంగాణ అన్ని రకాల వ్యవస్థలను విద్వంసం చేస్తున్నారు
`నాణ్యత లేని వస్తువులను అగ్గువకు విక్రయం
`ప్రజల జీవితాలతో చెలగాటం
`తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
`తెలంగాణ కుల వృత్తులు అస్తవ్యస్తం
హైదరాబాద్,నేటిధాత్రి: వ్యవస్ధలో ఎప్పుడూ ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. సమాజంలో ఎప్పుడూ ఏదో రకమైన సమస్య ఉత్పన్నమౌతూనే వుంటుంది. అసమానతలు పెచ్చురిల్లిన ప్రతి సందర్భంలోనూ ఏవో అసంతృప్తులు పెల్లుబుకుతూనే వుంటాయి. నిత్యం మన కళ్లముందు ఆధిపత్య ధోరణలు ఎదురౌతూనే వుంటాయి. వ్యవస్దను గుప్పిట్లో పెట్టుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తూనే వుంటారు. అవి రాజకీయాలైనా, వ్యాపారాలైనా, సమూహాలైనా సరే తమ ఆధిపత్యాన్ని నిర్ధేశించాలిన చూస్తాయి. వాటిని ప్రశ్నించే తరం కూడా ఎప్పటికప్పుడు గళం విప్పుతూనే వుంటాయి. లేకుంటే వ్యవస్ధలు అస్తవ్యస్తమౌతాయి. ఎక్కడో అక్కడ కట్టడి అనేది లేకపోతే విశృంకలత్వం పెరిగిపోతుంది. ఇదే సమయంలో అణచితలు కూడా పెరుగుతుంటాయి. వాటిని నుంచి బైట పడాలని కూడా అవతలి సమాజం చూస్తూనే వుంటుంది. పోరాటం చేస్తూనే వుంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం వుంటుంది. ఆ పరిష్కారం దొరికే వరకు అసంతృప్తులు వ్యక్తమౌతూనే వుంటాయి. ఒక సమస్య చల్లారుదందనుకునే లోపు మరో సమస్య పుడుతూనే వుంటుంది. మళ్లీ సమాజంలో సంఘర్షణ మొదలౌతూనే వుంటుంది. ఇది నిరంతరం కాలచక్రంలా తిరుగుతూనే వుంటుంది. అయితే ప్రతి సమస్యకు దొరికే పరిష్కారానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు సమస్యలు సర్ధుమణిగిపోవచ్చు. అంతకు మించి రెట్టింపు కావొచ్చు. దేశ స్వాతంత్య్రం కూడా అలాంటిదే. తెలంగాణ ఉద్యమం కూడా ఆ కోవకు చెందిందే. అంతెందుకు మహారాష్ట్ర, గుజరాత్‌లు విడిపోవడానికి కూడా అలాంటివే కారణం. ఇప్పుడు తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ అనే నిదానం ఆ మధ్య మొదలైంది. ఇప్పుడు అది ఊపందుకున్నది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది ఇప్పటికిప్పుడు చెప్పేది కాదు. ఆగుందనే నమ్మకం ఎవరిలోనూ లేదు. కారణం ఆ సమస్యను పరిష్కరించాలని రాజకీయాలు అనుకోవు. సమస్య జఠిలం చేయడంలో రాజకీయాల పెరుగకుండా వుండలేవు. మార్వాడీ గో బ్యాక్ అనే నినాదం సరైంది కాదు. కాని ఆ సమస్య తీవ్రతను ప్రపంచానికి తెలిలజేయాలంటే బలమైన నినాదం వుంటే తప్ప అది వెలుగులోకి రాదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉద్యమాలకు కూడా వర్తిస్తుంది. తెలంగాణ తొలి ఉద్యమ సమయంలో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవంతో ముగించారు. ఇది కూడా అంతే సమస్య మూలాలు తెలుసుకొవడం ఎంతైనా అవసరం. అనవసరమైన వివాదాలు సృష్టించుకోవడం అనవసరం. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని రాజకీయాలు భుజాన ఎత్తుకోవడం వల్ల చర్చల పరిధి దాటి జఠిలంగా మారుతాయి. రెండు వైపులా రాజకీయాలు చేరి, సమస్యను పెద్దది చేసి, రాజకీయాలు కాచుకుంటారు. గుడిబండను చేసి చూస్తుంటారు. ఒక్కసారి మార్వాడీల తెలంగాణ ప్రస్తానం చూస్తే ఇప్పుడే వచ్చింది కాదు. నైజాం కాలంలోనే మొదలైంది. కాని అప్పుడు ఎలాంటి వావాదాలు లేవు. కాని ఇప్పుడే ఎందుకు? అనే ప్రశ్న లోతుల్లోకి వెళ్తేనే సమాధానం దొరుకుతుంది. తొలు త చిన్న చిన్న టీ షాప్‌లతో మొదలైన మార్వాడీల ఆగమనం, వ్యాపారాలన్నీంటినీ గుప్పిట్లో పెట్టుకునే స్ధాయికి చేరుకున్నది. గతంలో ఉమ్మడి మహారాష్ట్రలో ఇదే సమస్య ఎదురైంది. మరాఠీ మీద గుజరాత్ ఆధిపత్యం మొదలైంది. ఇది గమనించిన మరాఠాలు గుజరాత్‌లను వ్యతిరేకిస్తూ వచ్చారు. చరిత్రలో గుజరాతీయులుగా చెప్పుకునే వారిని గుజ్జర్లు అంటారు. అంటే తిరుగుబాటు దారులు, ఆధిపత్యం కోసం ఆరాటపడేవారు అనే అర్దాలున్నాయి. అందుకే ఎక్కడికెళ్లినా వారి ఆధిపత్యం కోసం ఆరాటపడుతుంటారు. తెలంగాణ పట్టణాలతోపాటు, పల్లెల్లోకి కూడా మార్వాడీల వ్యాపారాలు విస్తరించాయి. ముఖ్యంగా కిరాణ షాపులు పెద్దఎత్తున వెలిశాయి. అక్కడ పెద్ద ఎత్తున జీరో దందా సాగుతుందనేది ఇతర వ్యాపారులు చెబుతున్న మాట. నాసిరకం వస్తువులు తెచ్చి, సగం ధరలకు విక్రయిస్తూ, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇతర వ్యాపారులను దెబ్బతీస్తున్నారనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. పల్లెల్లో దుకాణాలతోపాటు, ప్రతి కాలనీలోనూ మార్వడీల కిరాణషాపులు వెలిశాయి. తక్కువ ధరకు వస్తువుల విక్రయం ముసుగులో పెద్దఎత్తున నాసిరకం వస్తువులు దిగమతి చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. తెలంగాణను చెందిన వ్యాపారులు కనుమరుగయ్యేలా చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో నుంచి రైతులు ఊరు విడిచి ఎలా వెళ్లిపోయారో, ఇప్పుడు పల్లెల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారు పట్నంలో ఏదో ఒక పని చేసుకునే పరిస్ధితి దాకా వచ్చే ప్రమాదం వుందన్న మాటలు సరత్రా వినిపిస్తున్నాయి. చరిత్రలో గుజ్జర్ల తిరుగుబాటు గురించి అనేక చారిత్రక అంశాలు ప్రాచుర్యంలో వున్నాయి. ఎక్కడ పాతుకుపోతే అక్కడ ఆధిపత్యం మొదలుపెట్టడం మార్వాడీలకు అలవాటు. రాజ్యాలు పోయిన తర్వాత వ్యాపారాలు ఎంచుకున్నారు. వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అదే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. సహజంగా మార్వాడీల దోపిడీ అనేది కనిపించనంతగా వుంటుంది. కాని దాని వెనకాల పెద్ద వ్యాపారం తంత్రం వుంటుంది. కేవలం తమ వ్యాపారాలే వుండేలా, ఒక సమూహంగా వుండేందుకు మార్వాడీలు ఇష్టపడతారు. ఇలా ముప్పై ఏళ్ల క్రితం మొదలైన మార్వాడీల రాక తెలంగాణలో విస్తరిస్తూ వచ్చింది. మొదట్లో చిన్నగా జిలేజీ బండ్లు మొదలుపెట్టుకున్నారు. తర్వాత పానీ పూరీ పరిచయం చేశారు. స్వీట్ దుఖానాలు వెలిశాయి. తర్వాత చిన్న చిన్న హోటళ్లు మొదలయ్యాయి. బేకరీ సంస్ధలు మొదలయ్యాయి. ఇలా తొలుత పట్టణాలలో పాగా వేస్తూ వచ్చారు. అలా తర్వాత బట్టల వ్యాపారం పెద్దఎత్తున సాగించడం మొదలుపెట్టారు. అంతకు ముందే బంగారం వ్యాపారాలలో తాకట్టు షాఫులు పెట్టుకున్నారు. బంగారు దుఖానాలు తెరిచారు. ప్రస్తుతం డబ్బులు ఊరికే రావు అని చెప్పే వ్యక్తికూడా గుజరాత్ చెందిన వ్యక్తికావడం గమనార్హం. ఇక్కడ షాపుల మీద షాపులు పెట్టి, వేల కోట్ల బిజినెస్‌లు చేస్తూ, గుజరాత్‌లో వేలాది మందికి ఉచితంగా చదువు చెప్పిస్తున్నాని చెబుతుంటాడు. అంటే ఇక్కడి సంపాదన కారణమైన ప్రజల కోసం ఆయన చేసేదేమీ వుండదు. కాని గుజరాత్‌లో పేద విద్యార్ధులకు సాయం చేస్తుంటారు. ఇలా తెలంగాణ సంపద ఎలా తరలిపోతుందో చెప్పడానికి ఇదొక్క చిన్న సాక్ష్యం మాత్రమే. దేశంలోకి మెబైల్ రంగం విస్తరిస్తుందన్న సంగతి తెలిసిన వెంటనే తెలంగాణలోని అన్ని పట్టణాలలో మార్వాడీల మొబైల్ షాపులు, వాటి పరికాల షాపులు పెద్దఎత్తున వెలిశాయి. ఎలక్రిక్ షాపుల, వుడ్ వర్క్ షాపులు, మార్బుల్ షాపులు, పెయింట్ షాపులు, టైల్స్ ఇలా అన్ని రకాల వ్యాపారాలో మర్వాడీలు దూరిపోయారు. తెలంగాణ వారికి వ్యాపార వెసులుబాటు లేకుండానే కమ్ముకుపోయారు. ఇక మార్వాడీలు చేసే అంత్యంత విలువైన వ్యాపారాలలో వజ్రాల వ్యాపారం కూడా పెద్ద పాత్రను పోషిస్తోంది. వజ్రం అంటే అదొక రాయి. అంతే దానికి కొనేప్పుడు మాత్రమే విలువ. అంతుకు మించి ఏమీ వుండదు. బంగారం, వెండిలాంటి పాత్రను వజ్రాలు పోషించవు. అంతెందుకు బ్యాంకులు కూడా వజ్రాలను ఖరీదైన వస్తువులుగా గుర్తించవు. ఎందుకంటే బంగారాన్ని, వెండిని తాకట్టు పెట్టుకుంటాయి. లాకర్లు ఇస్తాయి. కాని వజ్రాలకు బ్యాంకులు లాకర్లు కూడా ఇవ్వవు. వజ్రాల నగలను మార్వాడీలు అమ్ముతారే గాని, వాటిని తాకట్టుపెట్టుకోరు. ఇలా ప్రజలకునొప్పి తెలియకుండా చేసే వ్యాపారాలలో మార్వాడీలు ఆరి తేరారు. ఇప్పుడే అసలు సమస్య మరో రూపంలో కూడా దాడి మొదలైంది. తెలంగాణలో తొలుత సివిల్ సప్లయ్ శాఖలో వేలు పెట్టారు. గన్నీ బ్యాగుల కుంభకోణానికి తెరతీశారు. తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా గన్నీ బ్యాగుల వ్యాపారం సాగించేది కూడా మార్వాడీలే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన గన్నీ బ్యాగుల సరఫరాలో పెద్దఎత్తున గోల్ జరిగిందనేది వెలుగులోకి వచ్చింది. అంతే కాదు తెలంగాణలో ఇటీవల సివిల్ సప్లయ్ శాఖ ఏర్పాటు చేసిన టెండర్ ప్యాడీ విధానంలో కూడా మార్వాడీ దూరిపోయాడు. ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య చిచ్చుకు తెరలేపుతున్నారు. మిల్లర్లనుంచి వడ్లు సేకరించే టెండర్ పాడిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని మిల్లులను బెదిరించి వసూళ్లు చేస్తున్నారు. ఇక్కడ మార్వాడీ తెలివి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హాయాంలో తెలంగాణలో పెద్దఎత్తున గురుకులాలు ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి గురుకులాలను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ గురుకులాలకు అవసరమైన అన్ని రకాలా సామాగ్రిని సరఫరా చేసిన వారిలో ముఖ్యుడు ఓ మార్వాడీ. దాదాపు సింహ భాగం ఆ మార్వాడీ స్కూళ్లకు అవసరమైన బెంచీలు, కుర్చీలు, ఇతర ఆట వస్తువులు, ఆహార పదార్థాలు సరఫరా చేశాడు. అందులో మార్వాడీ సరఫరా చేసిన వస్తువులు నాసిరకంగా వుండడంతో వాటిలో చాలా వరకు మూలన పడేసిన సందర్భాలున్నాయి. ఇక వైద్య శాఖలో కూడా వేలు పెట్టి, ఏకంగా కేసిఆర్ కిట్‌కు అవసరమైన వస్తువులను కూడా సరఫరా చేసింది కూడా మార్వాడీలే అనే సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలో విద్యావ్యాపారం కూడా కొత్తగా మొదలు పెట్టారు. మార్వడీ యూనివర్సిటీ అనేదానిని తెచ్చిపెడుతున్నారు. అది కాస్త తెలంగాణలో ప్రాధమిక స్ధాయి నుంచి, ఉన్నత విద్య వరకు స్కూల్స్, కాలేజీలు వచ్చే కాలాం ముందుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక తర్వాత రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే స్ధాయికి చేరుకుంటున్నారు. చాపకంది నీరులా విస్తరిస్తున్నారు. రాజసింగ్ లాంటివారు కూడా వారికి సపోర్టు చేయడానికి కారణం కూడా ఇదే..ఎందుకంటే తెలంగాణలో వుంటూ మూడుసార్లు ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు కూడా ఇప్పటికీ తెలుగు రాదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అండగా నిలవాల్సిన రాజాసింగ్ మార్వాడీలకు తోడుగా వుంటున్నాడు. ఇదీ మార్వాడీల ఐకమత్యం…మరి తెలంగాణ వారిలో ఈ సఖ్యత ఎంత వుందనేది కాలమే చెప్పాలి.