తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్
వరంగల్, నేటిధాత్రి
స్వామినాథన్ కమిటీ సిఫారసులప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేస్తూ చట్టం చేయాలి. ఈరోజు ఆత్మకూరు మండల్ కామారం గ్రామంలో తోట రాజేందర్ అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్మడం వల్ల ఏట రైతులు రూపాయలు 4 లక్షల కోట్ల నష్టపోతున్నారు నేటికీ పంటల ప్రణాళిక లేకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎస్ సి ఆర్ బి రిపోర్టు ప్రకారం ఏటా 10 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు దేశవ్యాప్తంగా కౌలురైతుల సంఖ్య పెరిగినప్పటికీ వారి రక్షణకు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఫలితంగా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో సగానికి పైగా కౌలు రైతులే ఉన్నారు బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా, ఎస్ కే ఎం ఐక్య కార్యచరణ కమిటీల పిలుపులో భాగంగా రైతులకు మద్దతుగా ప్రజలంతా భాగస్వామ్యలై ఈనెల 16న జరిగే గ్రామీణ రైతుల బందును జయప్రదం చేయాలని జిల్లా రైతాంగానికి ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ రైతు సంఘ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊరటి అంశాలరెడ్డి, తోట చంద్రశేఖర్, తోట కుమారస్వామి, గాదె రాజేందర్, చింతాకుల మహేందర్, రవి, శ్రీనివాస్, మూల రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.