4న జరిగే సెమినార్లో అవార్డు ప్రధానంతో సత్కారం….
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 02, నేటిధాత్రి:
సమాజ శ్రేయస్సుతోపాటు స్నేహంగా అందరి మంచి కోరుతూ గత 25 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో అందరి మన్నలను పొందుతూ విశేషమైన సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్ విశిష్ట ప్రతిభ అవార్డుకు ఎంపికైనట్లు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్( జె సి ఐ) సంస్థ చాప్టర్ జిల్లా అధ్యక్షులు ఆరుముళ్ళ రాజు తెలిపారు.1996లో జర్నలిస్టు వృత్తి లో నిస్వార్ధంగా అడుగుపెట్టిన కలువల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆయన కలం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఏడతెరిపి లేకుండా వార్త కథనాలు ఎప్పటికప్పటికీ సమాచారంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లిన రోజులు అనేకంగా ఉన్నాయని గుర్తు చేశారు.అంతేకాకుండా ఆయన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కొనసాగుతున్నట్లు తెలిపారు.అలాగే జర్నలిస్టు వృత్తిలో చాలామంది జర్నలిస్టులకు తోడునీడగా ఉండి ఒక మార్గం చూపించి ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా జర్నలిస్టు వృత్తి సేవలతో పాటు శ్రీనివాస్ చేస్తున్న గొప్ప సాంఘిక సేవలను కూడా గౌరవంగా తాము గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు.ఈనెల 4న మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే సెమినార్లో కలువల శ్రీనివాస్ కు అవార్డును బహుమతిగా ప్రధానం చేయడంతో పాటు సన్మానించడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా ఇంకా గత సంవత్సరంలో అనేక రంగాలలో గొప్ప గొప్ప సేవలు అందించిన ఇంకా చాలామంది సాంఘిక సేవకులను వివిధ డిపార్ట్మెంటులో పనిచేస్తున్న ఉద్యోగులను సంబంధిత అవార్డులకు ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.అయితే వాళ్ల యొక్క ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నా పెద్ద ఎత్తున సెమినార్ కు ముఖ్యఅతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు.అలాగే అతిథులుగా పుర ప్రముఖులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు దాంతో వాళ్ళ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేస్తామని స్పష్టం చేశారు.కాగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ దఫా కూడా నూతన సంవత్సరంలో నిర్వహించబోయే సెమినార్ ప్రోగ్రాం కార్యక్రమానికి అందరు కూడా సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జెసిఐ మంచిర్యాల అధ్యక్షులు వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.