పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రాడ్యుయేట్ టీచర్స్ ,వారి కుటుంబ సభ్యులు అందరూ* కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు గా నమోదు చేసుకోవాలని, నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టే ఎన్రోల్మెంట్ డ్రైవ్* లో భాగంగా
పి ఆర్ టి యు టి ఎస్ మండలం శాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ మండలంలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ & వారి కుటుంబ సభ్యుల అందరినీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఫారములను ఫామ్ 18 ను అందించడం జరిగింది. నల్గొండ,వరగంగల్,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో,* అర్హతలు కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ టీచర్స్ & వారి కుటుంబ సభ్యుల అందరితో ఫిబ్రవరి 6 తేదీ లోగా ఓటరుగా పేర్లను నమోదు చేయించుకోవాలని..
ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకుని, ప్రజా స్వామ్య పరిరక్షణకు పాటు పడాలని* కోరారు..
గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఫారంలు అందించి, నమోదును వేగవంతం చేసి 100% పూర్తి చేయాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధమని* అందుకు చైతన్యవంతంగా విజ్ఞులైన, విద్యావంతులైన, ఉపాధ్యాయులు,
విశ్రాంత ఉపాధ్యాయులు, పట్టభద్రులు ,అందరూ ఓటు నమోదు చేసుకావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల హైస్కూల్ ,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కేజీబీవీ సిఆర్టి పిజిసిఆర్ లు పాల్గొనీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.