అన్నదాన కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు
కరీంనగర్, నేటిధాత్రి:
అన్న ప్రసాద వితరణ సత్యసాయి బాబా శతజయంతి సందర్బంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహన మరియు సత్యసాయి సేవా సమితి కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్ ఆవరణలో రెండు వందల మందికి మరియు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఐదు వందల మందికి ఉచిత అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈసందర్బంగా క్లబ్ అధ్యక్షులు ననువాల గిరిధర్ రావు మాట్లాడుతూ, భగవాన్ సత్యసాయి బాబా విద్య, వైద్యం, ఆహరం, త్రాగునీరు వంటివి పేద ప్రజలకు అందించారని, ఎప్పుడు సమాజహితం కోసం పరితపించే వారని, ఆకార్యక్రమాలన్ని సత్యసాయి సేవా సంస్థ వారు కొనసాగించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో దాత ఏడె. పూర్ణిమ, క్లబ్ కార్యదర్శి లయన్ పాశం నర్సింహారెడ్డి, లయన్ అక్కినపల్లి అజయ్ కుమార్, లయన్ చిలుపూరి రాములు, లయన్ అలిశెట్టి శ్రీనివాస్, లయన్ ఉదారం వెంకటస్వామి, లయన్ వూట్ల దేవయ్య, లయన్ లేడీ ననువాల హరిప్రియ, రామకృష్ణ సత్యసాయి సేవా సమితి సభ్యులు బోనగిరి శ్రీధర్ రావు, డా.ఏడె గంగాధర్, సంజీవరెడ్డి, రామరాజు, రాజేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సాయి అశ్రీత్, తదితరులు పాల్గొన్నారు.
