గంగారం, నేటిధాత్రి
తేదీ ఏప్రిల్ 6న చలో తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్టి సభకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న ఉదయం 8 గంటలకు తుక్కుగూడకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు పార్టీ కార్యకర్తలు తరలి రాగలరు ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి శ్రీ ప్రియాంఖ గాంధీ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రివర్యులు ఇతర పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్గం పాల్గొంటారు ఈ సభకు
బస్సు సౌకర్యం కలదు జన జాతర సభకు తరలివచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం ని విజయవంతం చేయగలరని పిలుపునిస్తూన్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అన్నారు