బోధనా ప్రణాళికలను రూపొందించుకొని పాఠ్య బోధన చేయాలి…
మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి…
కేసముద్రం/ నేటి ధాత్రి
ఉపాధ్యాయులు ప్రణాళికలు రూపొందించుకొని తదనుగుణంగా పాఠ్య బోధన చేయాలని కేసముద్రం మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి అన్నారు. కాంప్లెక్స్ సమావేశాలలో భాగంగా శనివారం తాళ్లపూసపల్లి జడ్పీ హైస్కూల్ నందు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు, కేసముద్రం విలేజ్ జడ్పీ హైస్కూల్ నందు భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు.ఆయా కాంప్లెక్స్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ…కాంప్లెక్స్ సమావేశాలలో నేర్చు కున్న విషయాలను పాఠశాలలో ఉపయోగించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకే సమాజంలో చక్కని గుర్తింపు లభిస్తుందని ఎంఈఓ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు పట్ల ఉపాధ్యాయులకు నిర్లక్ష్యం తగదని,ప్రతి ఉపాధ్యాయుడు విధిగా ఎఫ్ ఆర్ ఎస్ యాప్ లో ముఖ గుర్తింపు హాజరు వేయాలని మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నరసయ్య, తాళ్ళపూస పల్లి జడ్పీ హైస్కూల్ ఇంచార్జీ ప్రధానోపాధ్యా యులు దేశ బోయిన వెంకన్న, ఆర్పీలు సునీత, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ తో పాటు పలువురు ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.