కరీంనగర్‌లో జాగృతిలోకి నాయకుల చేరిక

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక.

తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం.

జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు.

రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి.

కల్వకుంట్ల కవిత
జాగృతి అధ్యక్షురాలు.

జాగృతి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షురాలు కవితక్క సమక్షంలో కేంద్ర కార్యాలయంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో మండలానికి చెందిన YSR’TP మాజీ జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండమీద అంజయ్య, YRS’TP హుజురాబాద్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ జంపాల రితిష్, YSR’TP జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు అంబల హరిష్, అదేవిధంగా గంగాధర మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా సెల్ ఇంచార్జ్ మ్యాక వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర మోహన్, సుంకపాక రమేష్, గంగాధర మనోజ్, సుంకపాక కిరణ్ తదితరులు కవితక్క నాయకత్వం పట్ల విశ్వాసంతో జాగృతిలో చేరినారు. వారికి కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ భవిష్యత్త్ ను మార్చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ఈనెల ఇరవై ఐదోవ తేదీన మేడ్చల్ జిల్లా మునిరాబాద్ వేదిక అవుతుందని కవితక్క అన్నారు.

అరోజు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం జాగృతి పనిచేస్తుందని ఇప్పటికే యాబై కమిటీలు వేసి వాటి ద్వారా తెలంగాణ ప్రజలకు ఎదుర్కుంటున్న చాలా సమస్యలకు శాశ్వతమైన పరిష్కారానికి తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని స్వతంత్రం వచ్చి మనకు ఎడు దశాబ్దాల దాటినకూడ ప్రజలు ఇప్పటికీ అభివృద్ధి దూరంగా ఎందుకు ఉన్నారో మనల్ని ఇప్పటి వరకు పాలించిన పార్టీలు సమాధానం చెప్పాలని వారు అన్నారు.
ఈ సందర్భంగా జాగృతి జిల్లా నాయకులు యండి సల్మ రూపొందించిన పార్టీ ఆవిర్భావ వాల్ పోస్టర్ ను జాగృతి కవితక్క చేతులు మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా నాయకులు బుడిగె పర్శారం గౌడ్, యండి సల్మ, పోన్నం రమేష్, లింగారెడ్డి, తాజ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version