భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
జనం స్వచ్చంధంగా తండోపతండాలుగా తరలివచ్చారు:ఎంపీ రవిచంద్ర
పాటలు, నృత్యాలు, కేరింతలు,నినాదాలతో కొత్తగూడెం దద్దరిల్లింది:ఎంపీ రవిచంద్ర
ఇది కొత్తగూడెం చరిత్రలో లిఖించదగింది:ఎంపీ రవిచంద్ర
వనమా ఘన విజయం ఖాయమైంది:ఎంపీ రవిచంద్ర
ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన, విజయవంతం చేసిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు:ఎంపీ రవిచంద్ర
కొత్తగూడెం “ప్రజా ఆశీర్వాద సభ”బ్రహ్మాండంగా జరిగింది, దిగ్విజయమైందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత,తెలంగాణ అభివృద్ధి ప్రధాత,ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును స్వయంగా చూసి,వారి అద్భుతమైన ప్రసంగాన్ని చెవ్వులారా వినాలనే ఆసక్తితో అన్ని వర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు.జనం కాలినడకన గుంపులు గుంపులుగా, ద్విచక్ర వాహనాలు,ఆటోలు, ట్రాక్టర్లు,కార్లలో స్వచ్చంధంగా సభాస్థలికి వేలాదిగా చేరుకున్నారని ఎంపీ రవిచంద్ర వివరించారు.డప్పులు కొడుతూ,కోలాటం ఆడుతూ,నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ,”జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలతో కొత్తగూడెం దద్దరిల్లిందని ఒక ప్రకటనలో ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.ఈ సభ కొత్తగూడెం చరిత్రలో లిఖించదగినదని,తాము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారని,అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్నారు.సభాస్థలితో పాటు చుట్టుపక్కల రోడ్లలన్నీ కూడా జనంతో నిండిపోయాయని,జన ప్రభంజనం కనిపించిందన్నారు.మహనీయులు కేసీఆర్ గారి అనర్గళమైన ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారని, సానుకూలంగా స్పందించారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.సభకు హాజరైన జనాన్ని,ప్రసంగాన్ని శ్రద్ధగా వినడాన్ని చూసి ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేస్తూ నాతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్వరరావును అభినందించారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఈ సభ ఊహాకందని రీతిలో విజయవంతం కావడంలో తమ పార్టీ అభ్యర్థి వనమా గెలుపు ఖాయమైందని, సుమారు 50,000పై చిలుకు ఓట్ల మెజారిటీ తథ్యమని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన, విజయవంతమయ్యేందుకు సహకరించిన గులాబీ శ్రేణులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులు,మహిళలు, యువత, విద్యార్థులు, పాత్రికేయులు,అన్ని వర్గాల ప్రజలకు ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఇదే విధమైన సహకారాన్ని ఇక ముందు, ఎల్లప్పుడూ కూడా తెలియజేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ప్రజలకు సవినయంగా మనవి చేశారు.