పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మాజీ ఎంపిటిసి బండారి నారాయణ,నేతాని ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ చేరారు.వారికి చల్లా ధర్మారెడ్డి గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం క్రాంతి రమేష్ ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.