సిపిఐ పార్టీ నుండి కిన్నెర మల్లవ్వ సస్పెండ్- పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలోని పద్మ నగర్ కు చెందిన కిన్నెర మల్లవ్వ ను సంవత్సరం పాటు సిపిఐ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామిలు హాజరైనారని పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా ఆహ్వానిత కార్యవర్గ సభ్యురాలుగా, భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కిన్నెర మల్లవ్వ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పదుతుందనే ఆరోపణలు రావడంతో విచారణ కమిటీ వేయడం జరిగిందని,కమిటీ విచారణ చేసి జిల్లా పార్టీకి అందించడంతో రిపోర్ట్ ను కార్యవర్గ సమావేశంలో చర్చించి సభ్యుల ఏకాభిప్రాయం మేరకు మల్లవ్వ ను సంవత్సరం పాటు సిపిఐ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు మల్లవ్వ ను పార్టీ నాయకురాలిగా గుర్తించవద్దని పార్టీ శ్రేణులకు శ్రీనివాస్ సూచించారు.