ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం…

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎవరో తేలిపోయింది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి తరఫున మౌనిక ఆ పీఠాన్ని అధిష్ఠించనున్నారు. వివరాల్లోకెళితే…

నిర్మల్‌ జిల్లా, ఏప్రిల్ 05: ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఆ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ-బీఆర్‌ఎస్‌ కూటమి కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ కార్పొరేటర్‌ అంకం మౌనిక ఎన్నికవగా, వైస్ ఛైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. అంతకముందు.. ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా శనివారంనాడు కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. దీంతో అధికారులపై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేపట్టారు.

LATEST

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

ఇక.. ఖానాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ – 4, బీజేపీ – 4, కాంగ్రెస్‌ – 3 స్థానాల్లో గెలుపొందగా.. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌ అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌ బలం ఐదుకు పెరిగింది. దీంతో ముందుగా ఛైర్మన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థిగా మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఆమె పేరును ప్రతిపాదించడాన్ని తప్పబడుతూ ఆయన ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్య ఛైర్మన్‌ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version