మాట టిఆర్‌ఎస్‌.. కండువా బిఆర్‌ఎస్‌!

 

`ఆయాచితంగా కేసీఆర్‌ ఏదీ మాట్లాడరు?

`ఎంత ప్లో లో వున్నా మాట జారరు?

`అనాలనుకుంటేనే ఏదయినా అంటారు!

`అందుకే టీఆర్‌ఎస్‌ అని కావాలనే అన్నారు.

`శ్రేణులకు సంకేతం పంపించారు!

`పేరు మార్పు ఇక తప్పదని గ్రహించారా?

`టీఆర్‌ఎస్‌ లోనే తెలంగాణా గుండె చెప్పుడుందని తెలుసుకున్నారా?

`బీఆర్‌ ఎస్‌ ను పక్కన పెట్టడమే శ్రేయమని ఆలోచనకొచ్చారా?

`ఆ దిశగా తొలి అడుగు వేయడం జరిగిందా?

`అందుకే కేసీఆర్‌ నోట తొలి సారి టీఆర్‌ఎస్‌ అనే మాట వచ్చిందా?

                                        బిఆర్‌ఎస్‌లో ఏదో జరుగుతోంది. అంతర్మధనం మొదలైంది. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ ఏదీ ఆయాచితంగా మాట్లాడరు. ఏం మాట్లాడాలనుకున్నా, ఎంత మాట్లాడాలనకున్నా, తొకడం, బెనకడం జరగదు. ఒక మాట్లాడి దాన్ని సవరించుకోవడం అంటూ అసలే వుండదు. అది ఆయనకు మాత్రమే చెల్లిన విద్య. ఏం మాట్లాడాలనుకున్నా అది సూటిగానే మాట్లాడతారు. అందుకే ఈ మద్య తాజాగా జరిగిన బిఆర్‌ఎస్‌ పార్టీ విసృత స్దాయి సమావేశంలో టిఆర్‌ఎస్‌ అనే మాట ఆయన నోటి వెంట వచ్చింది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆ మాట ఆయన నోటి వెంట రాలేదు. బిఆర్‌ఎస్‌పై అనేక సూచనలు సలహాలు ఎంత మంది ఇచ్చినా టిఆర్‌ఎస్‌ మాట అసలే రాలేదు. ఎందుకంటే ఆయాచితంగానో, అనుకోకుండానో కేసిఆర్‌ నోటి వెంట ఏ మాట దొర్లదు. సుమారు ఇవరై ఏళ్లుపాటు టిఆర్‌ఎస్‌ అనే పదాన్ని కేసిఆర్‌ కొన్ని లక్షల సార్లు మాట్లాడి వుంటారు. కాని ఆ పార్టీ పేరు మార్చిన తర్వాత ఏనాడు టిఆర్‌ఎస్‌ అనే మాట ఆయన నోటి వెంట ఎవరూ విన్నది లేదు. పార్టీ నాయకుల ఆంతరంగిక సమావేశాలలో కూడా ఆ పదం వాడలేదు. ముఖ్యంగా పార్టీ మార్పు తర్వాత కూడా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. మీడియా సమావేశాలలో పొల్గాన్నారు. కాని ఏనాడు ఆ టిఆర్‌ఎస్‌ అనే మాట ఆయన నోటి వెంట రాలేదు. అప్పుడో ఇప్పుడో ఇతర నాయకుల నుంచి ఆ మాట వచ్చిందేమో కాని, కేసిఆర్‌ నోటి వెంట ఎవరూ వినలేదు. అలాంటిది ఒక్కసారిగా కేసిఆర్‌ నోటి వెంటే టిఆర్‌ఎస్‌ అనే మాటరావడం అనేది అందర్నీ ఆశ్చర్యపరిచింది. కార్యకర్తలు, నాయకుల్లో ఆ మాట కేసిఆర్‌ నోట వెంట రాగానే సంతోషం వెల్లివిరిసింది. నిజం చెప్పాలంటే టిఆర్‌ఎస్‌ అనే పదమే ఆ పార్టీ నాయకులకు వేదమంత్రమైపోయింది. బిఆర్‌ఎస్‌ అనేది వారికి ఇష్టంగా పలకలేని గొట్టు పద్యమైపోయింది. పైగా పార్టీ పేరు మార్చిన తర్వాత కలిసి రాలేదన్నది వాస్తవం. పార్టీ అనేక ఉపద్రవాలను ఎదుర్కొన్నది కూడా నిజం. కేసిఆర్‌ కూతరు కవిత కూడా జైలు పాలవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంగిపోయింది. ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఎప్పుడూ లేని విధంగా పార్టీ వరుస ఓటములను చవి చూస్తూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెల్చుకోకుండాపోయింది. ఉప ఎన్నికలు అంటేనే టిఆర్‌ఎస్‌. విజయాలు అంటేనే టిఆర్‌ఎస్‌లాగా వుండేది. ఎలాంటి ఉప ఎన్నికలైనా సరే సై అంటే సై అన్నట్లు పోటీ చేసి గెలిచిన సందర్భాలున్నాయి. బిఆర్‌ఎస్‌ పార్టీ చీలుతుందని, ఎమ్మెల్యేలుపార్టీ మారుతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అలాంటి ఊహకందని పరిణామాలెన్నో బిఆర్‌ఎస్‌లో జరుగుతున్నాయి. అంతే కాకుండా 2001 నుంచి 2023 వరకు ఏనాడు కేసిఆర్‌ ఆనారోగ్యం పాలైంది లేదు. ఆయనపై అప్పట్లో కూడా అనేక రూమర్లు వున్నా, దుక్కలాగానే ఆయన వుంటూ వచ్చారు. ప్రమాదాల బారిన పడిన సందర్భం కూడా లేదు. 2006 ఒకసారి కూడా బాత్రూంలో కాలు జారినా చాలా తొందరగా కోలుకున్నారు. మళ్లీ జనం ముందుకు వచ్చారు. ఆ సంఘటన కూడా ఎవరికీ తెలియదు. కాని 2023 ఎన్నికల్లో ఓటమి పాలైన కొద్దిరోజులకే ఆయన కాలు జారి పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అంటే బిఆర్‌ఎస్‌ నుంచి ఆయన మనసు టిఆర్‌ఎస్‌ వైపు మళ్లించుకుంటున్నారన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కొవడమే మంచిది. ఇప్పుడు సరిగ్గా కేసిఆర్‌ అదే చేస్తున్నట్లు వుంది. తాను బైటకువస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఆరోగ్యంగా కనిపించారు. ఉల్లాసంగా అందరితో కనిపించారు. మీడియా సమావేశం ఆద్యాంతం మంచి ఆహ్లాదరకమైన వాతావరణం చూపించారు. అప్పటికే రెండు గంటల పాటు నిలబడి పార్టీ నాయకులు దిశనిర్ధేశం చేశారు. తర్వాత గంటన్న పాటు మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఆయన ఒత్తిడికి గురైనట్లు కనిపించలేదు. గతంలో మాట్లాడుతున్న సందర్భాలలో దగ్గుతూ వుండేవారు. ఈసారి అలాంటిది ఏది కనిపించలేదు. సంపూర్ణ ఆరోగ్యంగా వున్నట్లు కనిపించారు. ఇక ప్రజా క్షేత్రంలోకి వస్తానని ప్రకటించారు. అదే సమయంలో పార్టీ పేరును మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ కనిపించడం లేదని ఆనాటి నుంచి అందరూ చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే అంటున్నాయి. ఇక దేశ రాజకీయాల కన్నా, రాష్ట్ర రాజకీయాల మీదే దృష్టిపెట్టాలని కేసిఆర్‌ బలంగా నిర్ణయించుకున్నట్లున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఏ పాలమూరు అడుగులు వేశారో ఇప్పుడు మళ్లీ అదే పాలమూరును ఎంచుకొని, పార్టీ పేరును మార్చుకొని అడుగులు వేయాలని చూస్తున్నట్లు అర్ధమౌతోంది. అందుకు కార్యాచరణ లేకుండా కేసిఆర్‌ టిఆర్‌ఎస్‌ అనే మాట మాట్లాడరు. ఈ విషయంలో నేటిధాత్రి ఇప్పటికే అనేక సార్లు చెప్పింది.. అనేక సూచనలు చేసింది. బిఆర్‌ఎస్‌ భవిష్యత్తును అంచనా వేసింది. పార్టీ పేరు వల్ల ఎదురైన నష్టాలను ఉటంకించింది. మళ్లీ టిఆర్‌ఎస్‌ పేరుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను కూడా అనేక సార్లు నేటి దాత్రి చెప్పింది. టిఆర్‌ఎస్‌ మీద నేటిదాత్రి చెప్పిన మాటలే నిజమౌతాయన్న సంకేతాలు మాత్రం అందుతున్నాయి. చూద్దాం…!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version