కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భాగ్యరాజ్…
కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:-
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పెద్ద నాటకమని. చేగుంట మండలం చందాయిపేట మాజీ సర్పంచ్ స్వర్ణలత , కాంగ్రెస్ జిల్లా నాయకులు భాగ్యరాజ్ అన్నారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ తండ్రిగా కేసీఆర్ ఇంకా ఇప్పటివరకు రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రధాని మోదీ సైతం దీనిపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కెసిఆర్ మోదీ మౌనం వెనుక, రెండు పార్టీలు ఒకటే నని తెలుసుపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఇద్దరు కలిసి చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రానున్న పార్లమెంట్ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తానన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క సారథ్యంలో 17 పార్లమెంట్ స్థానాలకు17 కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని భాగ్యరాజ్ ధీమా వ్యక్తం చేశారు.