# ఎమ్మెల్యే దొంతి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ నుండి చేరికలు
నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ గుడిపల్లి ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి ,దుగ్గొండి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ రెడ్డి ల అధ్వర్యంలో పార్టీలో చేరగా ఎమ్మెల్యే దొంతి కాంగ్రెస్ కండువాలు కప్పి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులైన పలువురు బిఆర్ఎస్ నాయకుల వలసలు పెరుగుతున్నాయని అన్నారు.పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికీ తగిన న్యాయం చేస్తానని ఎమ్మెల్యే దొంతి హామీ ఇచ్చారు..
# నాచినపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి వివరాలు…
పిఎసిఎస్ వైస్ చైర్మన్ గుడిపల్లి ధర్మారెడ్డి ,బొమ్మినేని శ్రీనివాసరెడ్డి, రూపిక శ్రీనివాస్,ఓరుగంటి తిరుపతి,
వేముల రవీందర్ రెడ్డి,నల్లూరు నరోత్తం రెడ్డి,అడ్ర సురేందర్ రెడ్డి,చెన్నూరు కృష్ణారెడ్డి,నల్ల భాస్కర్ రెడ్డి,గాదం రాయకొమురు,మెరుగు రంగారెడ్డి,గుడిపల్లి మోహన్ రెడ్డి,
నగరబోయిన రవి,ముసుకుల స్వామి రెడ్డి,బైరెడ్డి నారాయణరెడ్డి, అండ్ర సుదర్శన్ రెడ్డి,గుండెబోయిన మల్లయ్య,కన్నబోయిన సారయ్య,గుండెబోయిన మల్లయ్య,
చెన్నూరి రాజులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మట్ట రాజు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదాసి సాంబయ్య, శ్రీరామోజు ప్రభాకర్,బీసీ సెల్ అధ్యక్షులు మట్ట రమేష్, మండల ఉపాధ్యక్షులు మట్ట చిన్న దయాకర్, జటబడిన సురేష్, రేముడాల దామోదర్ రెడ్డి,చెన్నూరి అచ్చిరెడ్డి, గోవిందు మురారి,ఇజ్జగిరి నరేష్,జెట్టి ప్రశాంత్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.