మాజీ సర్పంచ్ కందగట్ల రవి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలకు స్థానిక మాజీ సర్పంచ్ కందగట్ల రవి తన తండ్రి కందగట్ల సమ్మయ్య స్మారకార్థం 12వేల విలువ కలిగిన 4 సిమెంట్ బెంచీలను మంగళవారం బహుకరించారు. పాఠశాలలో ప్రతినెల రెండవ ఆదివారం పేరెంట్స్ విజిటింగ్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూర్చోవడానికి పడుతున్న ఇబ్బందులను గమనించిన స్థానిక ప్రిన్సిపాల్ మోతే రాజ్ కుమార్ సిమెంట్ బెంచీల విషయమై మాజీ సర్పంచ్ కందగట్ల రవి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన రవి తన తండ్రి స్మారకార్థం 4 బెంచీలను పాఠశాలకు బహుకరించారు. మాజీ సర్పంచ్ రవికి ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వినుకొండ శంకరాచారి, వల్పదాసు సదాశివుడు, గాజుల రవి, కొత్తపల్లి రవి పాల్గొన్నారు.