అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బండి రాణి సదానందం
1116 చెల్లించిన వారికీ 30రోజుల రుద్రాభిషేకం-చైర్మన్ గందే వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం నందు 14 మంగళవారం నుండి తేదీ డిసెంబర్ 13 బుధవారం వరకు శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానము నందు కార్తీక మాసోత్సవ పూర్వక వజ్రగ్రధిత పాశుపత మహారుద్రయాగ సహిత ఆకాశదీపోత్సవ, మహాఅన్నదాన మహోత్సవాలను పండితులు బ్రహ్మశ్రీ కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు తెలిపారు.పరకాల వాస్తవ్యులు దంపతులు చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దంపతులకు ప్రత్యేక మాసం వేల ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కార్తీక మాస ఉత్సవ పూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేటి నుండి కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును అని తేలిపారు.స్వామి వారి భక్తులు 1116/- చెల్లించి రసీదు పొందిన వారి కుటుంబ సభ్యులకు గోత్రనామాలతో 30 రోజులపాటు ప్రాతః కాల రుద్రాభిషేకముమరియు 1116/-చెల్లించి రశీదు పొందిన వారి కుటుంబ సభ్యులకు 30 రోజులు గోత్ర నామములతో ఆకాశ దీపం నిర్వహించబడునని తెలిపారు.బండి రాణి సదానందం నిర్వహించడం జరిగింది.సాయంత్రం అల్ఫాహారం ఎర్రo లత రాజు నిర్వహించడం జరిగినద అన్నారు.ఈ కార్యక్రమంలో సోద రామకృష్ణ,వైస్ ఛైర్మెన్ జయపాల్ రెడ్డి,మాజీ మార్కెట్ ఛైర్మెన్ బండి సారంగపాణి,ధర్మకర్తల మండలి అర్చకులు కోమాళ్ళపల్లి నాగభూషణ శర్మ
ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటయ్య మరియు భక్తులు పాల్గొన్నారు.