జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని పెగడపల్లి, గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక సర్పంచ్ పడాల రాజమణి,మల్ల గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బుధవారం రోజున ప్రచార కార్యక్రమం చేపట్టారు.బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని ఆయనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు .చెన్నూరు నియోజకవర్గం లో గత కొన్ని సంవత్సరాల నుండి ఇతర పార్టీల నాయకులు పరిపాలించిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలిచాక చెన్నూరు ను ఒక సిద్దిపేట సిరిసిల్ల లాగా అభివృద్ధి చేశారని సుమన్ పేరు వింటేనే ప్రజలకు అభివృద్ధి గుర్తుకొస్తదని అలాంటి వ్యక్తిని మళ్లీ ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.