పరకాల క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన కల్వకుంట్ల కవిత
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)చీఫ్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరకాల పట్టణ అంబేద్కర్ సెంటర్ రాజీపేటకు చెందిన యువతకు క్రికెట్ కిట్లు,టీఆర్ఎస్ ముద్రించిన టీషర్ట్‌లను పంపిణీ చేశారు.బొచ్చు రాజు స్వేరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి పరకాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని,చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
