కాళేశ్వరం ప్రాజెక్టు సజీవం
గాయత్రి పంప్ హౌస్ నిలువెత్తు సాక్ష్యం
పసుపు కుంకుమతో పూలాభిషేకం చేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
దేశానికే తలమానికంగా నిలిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు సంవత్సర వ్యవధిలోనే పూర్తి చేసిన ఘనత కెసిఆర్ కాదా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు కళ్ళు ఉండి చూడలేకపోతున్నారా? అలాంటప్పుడు గాయత్రి పంప్ హౌస్ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటూ చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఘాటుగా విమర్శించారు. ఈసందర్భంగా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని గాయత్రి బాహుబలి పంప్ హౌస్ నీటి విడుదలతో గురువారం నాడు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పూలతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సుంకె రవిశంకర్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలు కాళేశ్వరం కూలింది, కుంగింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకు నిలువెత్తు నిదర్శనమే పరవళ్ళు తొక్కుతున్న గాయత్రి బాహుబలి పంప్ హౌస్ నీటి ప్రవాహం అని సూచించారు. సముద్ర గర్భంలో కలిసి వృధాగా పోతున్నటువంటి నీటిని కేసీఆర్ ఒక బృహత్తరమైన ఆలోచనతో కాళేశ్వరం, ఎల్లంపల్లి, నంది మేడారం, కన్నెపల్లి, అన్నపూర్ణ, మిడ్ మానేరు, గాయత్రి బాహుబలి పంప్ హౌస్ లాంటి ఎత్తిపోతల పథకాన్ని ఆరు వందల మీటర్ల లోతు నుండి నీటిని తోడి రైతంగానికి అందిస్తున్నటువంటి గొప్ప ఘనత కేసిఆర్ ది కాదా అని ప్రశ్నించారు. అలాంటి మహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది కుంగింది అంటూ ప్రజలకు అసత్య ప్రచారం నింపి గద్దనెక్కిందని విమర్శించారు. అదే కూలిన పొంగిన ప్రాజెక్టు ద్వారా వస్తున్నటువంటి నీటిని బుధవారం విడుదల చేసి మేమే రైతంగానికి నీళ్లు ఇస్తున్నామంటూ ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని గాయత్రి బాహుబలి పంప్ హౌస్ నిర్మించడం జరిగిందని నూట ముప్పై తోమ్మిది మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపారులతో మూడు వందల ఇరవై మూడు మీటర్ల ఎత్తులో శ్రీరాజరాజేశ్వర జలాశానికి తరలిస్తున్న ఘనత కేసీఆర్ ది కాదా అని సూచించారు. గత వారం రోజుల క్రితం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కన్నెపల్లి వద్ద పంపులు ఆన్ చేసేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో వారం రోజుల్లో నీటి విడుదల జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేమే నీటిని విడుదల చేస్తామంటూ హెచ్చరించిన ఫలితమే నేడు బాహుబలి గాయత్రి పంప్ హౌస్ నీటి విడుదల జరిగిందని రవిశంకర్ సూచించారు. పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుస క్రమంలో పెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ అదే సంవత్సరంన్నర గడిచిన వ్యవధిలోనే మళ్లీ మొదటికి వచ్చిందని రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసలో పెట్టవలసి వస్తుందని కనీసం రైతులకు ఎరువులు అందించే పరిస్థితి లేని దుస్థితి ఎదురైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతన్నను దృష్టిలో పెట్టుకొని సాగు నీటిని విడుదల చేయడం అది కేసీఆర్ ఘనత అని సూచించారు. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మురళి, చాడ శేఖర్ రెడ్డి, గంటల వెంకటరెడ్డి, కరబూజ తిరుపతి గౌడ్, ఒంటెల రమణారెడ్డి, చాడ రాజేందర్ రెడ్డి, జూపాక మునిందర్, సైండ్ల కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.