జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి
జువ్వలదిన్నె హార్బర్‌పై పుకార్లు, అసత్య ప్రచారాలు నమ్మొద్దని.. హార్బర్‌ని ప్రైవేటు పరం చేసే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
జువ్వలదిన్నె హార్బర్‌పై పుకార్లు, అసత్య ప్రచారాలు నమ్మొద్దని.. హార్బర్‌ని ప్రైవేటు పరం చేసే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) స్పష్టం చేశారు. కృష్ణపట్నం పోర్టుకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో కృష్ణపట్నం నుంచి వాడరేవు వరకు ఎలాంటి పోర్టులు రాకూడదని జీవో ఎంఎస్ నంబర్- 40 ఇచ్చారని గుర్తుచేశారు. ఈరోజు(శనివారం) నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
LATEST
ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..
ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ
మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి
జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ
మనీ ప్లాంట్ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం
సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన
అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య
ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్
అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’
తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్

కృష్ణపట్నం పోర్టుపై పెత్తనం కోసం తండ్రిని అడ్డం పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో తెప్పించారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహించారు. పోర్టులు, హార్బర్లు, చివరకు జెట్టీలు రాకుండా చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలోనే రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్‌లు వచ్చాయని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకారంతో హార్బర్ తెచ్చామని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా 900 మీటర్ల జెట్టీతో హార్బర్ తెచ్చామన్నారు. బ్లూ రివల్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.130కోట్లు, టీడీపీ ప్రభుత్వం రూ.150కోట్లు నిధులతో జువ్వలదిన్నె హార్బర్‌ని తాము తీసుకువచ్చామని తెలిపారు. జగన్ ఈ నెల 15వ తేదీన జువ్వలదిన్నెకి వస్తానంటున్నారని.. ఏమి చెప్పేందుకు జగన్ వస్తున్నారని ప్రశ్నించారు.
జగన్ అడ్డగోలు జీవోలు తెచ్చారు..
పోర్టులు, హార్బర్‌లు, జెట్టీలు రాకుండా జీవో తెప్పించానని చెబుతావా? ఐదేళ్లుపాటు జువ్వలదిన్నె హార్బర్ పూర్తి చేయలేకపోయామని చెబుతావా? అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్‌ని అడ్డుపెట్టుకుని జగన్ అడ్డగోలు జీవోలు తెచ్చారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేశావని… నోటికొచ్చినట్లుగా మాట్లాడవద్దని హితవు పలికారు. రూ.288కోట్ల నిధులు తాము తెస్తే… జగన్ హయాంలో నిర్మించడానికి ఐదేళ్లు పట్టిందని ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మల్టీపర్పస్ జువ్వలదిన్నె హార్బర్‌ని మూడు నెలల్లో మత్స్యకారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. జువ్వలదిన్నె హార్బర్‌కి 123 ఎకరాల భూమి ఉందని.. 200 బోట్లు వచ్చి నిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. జగన్ ఏ రోజైనా ఢిల్లీకి వెళ్లి, ఒక్క ప్రజా ప్రయోజనకర జీవో తీసుకువచ్చావా..? అని ప్రశ్నించారు. సాగర్ డిఫెన్స్ పరిశ్రమతో మత్స్యకారులకు అత్యాధునిక టెక్నాలజీ, ఉపాధి అందుతాయని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.