రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పర్శరాములు అనారోగ్యంతో మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం భార్య మరణించగా ఇద్దరు కూతుర్లకు అన్నీ తానై కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ విదివైపరిత్య పర్షరాములు సైతం మృతి చెందడంతో ఇద్దరు చిన్నారుల జీవితం అగమ్యగోచరంగా మారిపోయింది. నిలువ నీడ లేని పరిస్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నా పిల్లలను ఆదుకోవడానికి అనాధలుగా ఉండకూడదన్న గొప్ప మనసుతో గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హైస్కూల్ కరస్పాండెంట్ మినుకుల మునీందర్ సహృదయంతో పిల్లల భవిష్యత్తుకు పదివేల రూపాయల నగదు, ఇరవై ఐదు కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందిస్తూ, పైచదువులకు సంబంధించి పాఠ్య పుస్తకాల కోసం సహకారం అందిస్తారని తెలపడం జరిగినది. ఈసందర్భంగా మునీందర్ కి గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.