#హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా
#బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో
#బిఆర్ఎస్ కండువా కప్పుకున్న బిజెపి నాయకులు
వీణవంక, కరీంనగర్ జిల్లా:
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చాడ రాజేందర్ రెడ్డి తో పాటుగా సుమారు 50 మంది రాష్ట్ర హోం శాఖ మంత్రి మొహమ్మద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుందని హైదరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పాడి కౌశిక్ రెడ్డి తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎక్కటీ రఘుపాల్ రెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, కామెడీ శ్రీనివాస్ రెడ్డి, జీడి వెంకటస్వామి, పోరెడ్డి తిరుపతిరెడ్డి, వీరబోయిన శ్రీనివాస్,వీరితో పాటుగా ఎలుక హరినాథ్ రెడ్డి, ముత్తిరెడ్డి రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వడ్డేపల్లి సదానందం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.