బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ సమక్షంలో భారీగా చేరుతున్న యువత
కొడిమ్యాల (నేటి ధాత్రి):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 300 మంది యువత బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా అభ్యర్థి సుంకే రవిశంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.స్థానిక బిడ్డనైన నేను అందరికీ అందుబాటులో ఉంటున్నానని మరొకసారి గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
ఆరోగ్యశ్రీ 15 లక్షల వరకు పెంచడం జరుగుతుందని అన్నారు.అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమైందని అన్నారు.కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పునుగోటి ప్రశాంతి కృష్ణారావు, ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనర్సింగరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.