జెడ్పీటీసీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఆగ్రహం
పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కుట్రపూరితంగా బూత్‌లు మార్చారని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశార
పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కుట్రపూరితంగా బూత్‌లు మార్చారని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మొత్తం వెబ్‌కాస్టింగ్ బయటపెట్టాలి. పులివెందులలో జరిగింది ఎన్నికేనా?. ఇతర గ్రామాలకు వెళ్లి ప్రజలు ఓటు వేయాలా?. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులను పెట్టారు.
6 పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఒక్కో బూత్‌లో 500 మంది వరకు బయటివాళ్లు ఓటు వేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటరు కాకపోయినా అక్కడే తిష్టవేశారు. బందిపోటు దొంగల తరహాలో ఎన్నిక జరిగింది‘ అని అన్నారు.
