భూమి పక్కకు ప్రభుత్వ భూమి ఉందా… ఆ భూమి మనదే పాగా వేసేయ్..

భూమి పక్కకు ప్రభుత్వ భూమి ఉందా… ఆ భూమి మనదే పాగా వేసేయ్..

ప్రభుత్వ భూములకు రక్షణ కరువు…

పేద వాడు చిన్న పూరిగుడిసే వేస్తే నేల మట్టం చేసే రెవెన్యూ అధికారులు.. ఇప్పుడెక్కడ..?

భూమి కబ్జా చేసి సిట్టింగ్ పాయింట్ ఏర్పాటు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ప్రభుత్వ భూమి పక్కకు వాళ్లకు సొంత జాగా ఉందంటే కొంత ప్రభుత్వ భూమిని కలుపుకోవచ్చనే భావన రామకృష్ణాపూర్ లోని కొంత మంది ప్రజా ప్రతినిధులు, పలుకుబడి ఉన్న వాళ్లలో కనిపిస్తోంది. ప్రభుత్వ భూమి పక్కకు సొంత జాగా ఉంటే పాగా వేసుడే అనే చందంగా నడుస్తోంది రామకృష్ణాపూర్ పట్టణంలో. అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. సర్వే నంబర్ 07 లోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురవుతున్న సరే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తా నుండి ఏరియా ఆసుపత్రికి వెళ్ళే దారిలో మద్యం దుకాణం ఉండగా దుకాణానికి సిట్టింగ్ పాయింట్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చుట్టూ మొక్కలు నాటి రేకుల షెడ్డు వేశారు. ఇదంతా రెవెన్యూ ,మున్సిపాలిటీ అధికారులు చూస్తున్నా సరే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రధాన రహదారి పక్కన గల భూమికే రక్షణ కల్పించకపోతే ఎలా అని సంబంధిత అధికారులను డిమాం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో పనిచేసిన ఎమ్మార్వోలు ఇట్టి స్థలం ప్రభుత్వ స్థలం అని సూచిక బోర్డు ఏర్పాటు చేస్తే దానిని తీసివేసి యదేచ్చగా ఆక్రమణలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకునట్లు వ్యవహరిస్తుండటం ప్రజల్లో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేదవాడు చిన్న పూరి గుడిసె వేసుకుంటే రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు గద్దల్లా వాలుతారు కానీ రోడ్డు పక్కన ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని పుర ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు…

మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అట్టి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అన్ని హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సర్వే నెంబర్ 7 లో గల ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లయితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాజీవ్ చౌక్ నుండి ఏరియా హాస్పిటల్ వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు వెనకాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే,అది ప్రభుత్వ భూమి అని తేలితే తొలగిస్తామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version