బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్
ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్పుకొచ్చింది.
ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ (Telangana IPS Officers Association) పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్పుకొచ్చింది. కరీంనగర్ సీపీ గౌశ్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేశారని అసోసియేషన్ మండిపడింది.
