జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో పర్వతాల మల్లన్న స్వామి ఆలయం లో ఉత్సవ విగ్రహము, నవగ్రహ విగ్రహాలు,ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టారు.
వేలల గట్టు మల్లన్న స్వామి మొక్కుబడులు చెల్లించేందుకు వేలాల జాతరకు వెల్లే భక్తులు మొదటగా కిష్టాపూర్ గ్రామం పర్వతాల మల్లన్న దర్శనం చేసుకుని జాతరకు బయలుదేరుతారు. వేలాల మల్లన్న జాతర సమీపిస్తున్న సందర్భంగా కిష్టాపూర్ పర్వతాల మల్లన్న స్వామి ఆలయం లో భక్తులకు సౌకర్యాలు సమకూర్చే పనులు మొదలుపెట్టినారు.గ్రామంలోని యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో
దుద్దిళ్ళ మనోహర అవధాని, ధీరజ్ శర్మ వేద పండితులచేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో ఆలయం చెంతకు చేరి నియమనిష్ఠలతో ఈ కార్యక్రమంలో పాల్గొని అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన పనులు మొదలుపెట్టిన నాటి నుండి ఒక యజ్ఞం లాగా అకుంఠిత సంకల్పంతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కిష్టాపూర్ యువజన సంఘం క్రియాశీలక పాత్ర పోషించారు.