మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్ కోరారు. శనివారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి సేవా సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 5న పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఉదయం10గంటల నుండి మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆటల పోటీలో మహిళలకు మ్యూజికల్ బాల్, త్రో బాల్, బాంబ్ ఇన్ బ్లాస్ట్ ల తోపాటు స్త్రీలను గౌరవించడం ప్రపంచ ఆవశ్యకతను తెలియజేయుట అంశంపై ఉపన్యాస పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏరియా ఉద్యోగుల వారి భార్యలు, పిల్లలు చుట్టుపక్కల గ్రామాల మహిళలు, ఏరియాలోని మహిళలందరూ ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. పోటీలో గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు, కన్సోలేషన్ బహుమతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సైతం మహిళలు అధిక సంఖ్యలో పోటీలలో, వేడుకలలో పాల్గొని, మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ సెల్, సేవా సమితి కోఆర్డినేటింగ్ అధికారి, డివైపిఎం ఎండి ఆసిఫ్, సేవ కోఆర్డినేటర్లు, సేవా సమితి సభ్యులు, ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.