ఓదేల (పెద్దపెల్లి జిల్లా) నేటి ధాత్రి:
శ్రీరాంపూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఓదెల మండలం పోత్కపల్లి ట్రాన్స్కో సెక్షన్ లో గల గూడెం జూనియర్ లైన్ మెన్ ఎన్ అజయ్ ని సస్పెన్షన్ చేసినట్టు పెద్దపల్లి డివిజన్ ట్రాన్స్కో డి ఈ దాసరి తిరుపతి తెలిపారు. ఓదెల మండలం పొత్కపల్లి సెక్షన్ పరిధిలోని గూడెం జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న అజయ్ వినియోగదారుల సమస్యల పై నిర్లక్ష్యంగా వ్యవరించడం, వారికి అందుబాటులో లేకపోవడం, విద్యుత్ బిల్లులు వసూలు చేసి సకాలంలో డిపార్ట్మెంట్ కి చెల్లించక పోవడం వంటివి చేస్తున్నట్టు డి ఈ తెలిపారు. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ చేపట్టి నిర్ధారణ కావడంతో అజయ్ నీ విధుల నుండి సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ట్రాన్స్కో ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన అవినీతికి పాల్పడిన కఠిన చర్యలు తీసుకొనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.