26 న భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T161653.754.wav?_=1

 

26 న భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి.

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల,నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఈనెల 26న భారత రాజ్యాంగ ఆమోదించిన రోజును మండలంలోని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా ఘనంగా నిర్వహించాలని కోరినారు, భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసి ఈ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఆమోదించడం కోసం అప్పటి రాష్ట్రపతి ప్రధానమంత్రి బాబు రాజేంద్రప్రసాద్ మరియు జవహర్లాల్ నెహ్రూకి రాజ్యాంగ కమిటీకి ఇచ్చి ఆమోదింపజేసిన రోజున కుల మతాలకు అతీతంగాp ప్రతి ఒక్కరు సబండ వర్గలు ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ మహిళలతో పాటు అందరు పాల్గొనీ విజయవంతం చేయాలని అన్నారు . భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు 26 నవంబర్ నాడు 76వ రాజ్యాంగ ఆమోదించిన రోజున గ్రామ మండల జిల్లా వ్యాప్తగా అందరు ఘనంగా నిర్వహించుకోవాలని ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు చిత్ర పటాలకు పూలమాలలు వేసి సభలు సమావేశాలు పెట్టి స్కూల్లో కళాశాలల్లో భారత రాజ్యాంగం ఆవశ్యకత మీద ప్రజలకు అవగాహన కల్పించాలని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిన నేటికీ సమాజంలో ఉండబడిన అసమానతలు ఆర్థిక అసమానతలు కుల సమానతలు ఇంకా రోజురోజుకు పిచ్చి మీరుతున్నాయి తెలిపారు .రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నదని, అంబేద్కర్ యువజన సంఘాలు దళిత మేధావులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మేధావులు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకత గురించి అందరికీ తెలియపరచాలన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version