మంత్రి శ్రీధర్ బాబు పై అనుచిత వాక్యాలు సరికావు

రైతుల కష్టాన్ని దోచుకున్నది మాజీ పిఎసిఎస్ చైర్మన్ నారాయణరెడ్డి:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరు
కాటారం , నేటి ధాత్రి
మంత్రి శ్రీధర్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు సరికావని కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునురి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాటారు మండలం ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి సింగిల్ విండో చైర్మన్ పదవి కాల సమయంలో తాలు పేరుతో రైతులు పండించిన ధాన్యంలో కటింగ్ చేసి రైతుల కష్టాన్ని దోచుకున్నారని తీవ్రంగా విమర్శించారు. అధికారం పోవడంతో రైతులపై నారాయణరెడ్డి ముసలి కన్నీరు కారుస్తూ, రైతును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నారాయణ రెడ్డి సొసైటీ చైర్మన్ గా ఉన్న సమయం లో రైతులను అనేక అంశాలో ఇబ్బందులకు గురిచేశారని సరైన సమయం లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం తో రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసి వరధాన్యానికి నిప్పుపెట్టి నిరసన చేసిన విషయాన్నీ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన 5 రోజులలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల పక్షాన నిలిచి ఆదుకుంటాంమని తెలిపారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలిపారు . ఈ కార్యక్రమంలో చీర్ల తిరుపతిరెడ్డి, భూపెల్లి రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గద్దల రమేష్, మాజీ ఎంపిటిసి కుమ్మరి అశోక్ లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version